ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ రవితేజ ఫాన్స్ ఉన్నంత జోష్ లో మరే హీరో ఫాన్స్ ఉండరు. రెండు నెలలు తిరగకుండానే రెండు వంద కోట్ల సినిమాలని ఫాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు రవితేజ. డిసెంబర్ నెలలో ధమాకా సినిమాతో వంద కోట్లు రాబట్టిన రవితేజ, ఆ తర్వాత చిరుతో కలిసి జనవరి నెలలో 250 కోట్ల గ్రాస్ వసూల్ చేశాడు. ఇదే జోష్ లో మరో హిట్ ఇచ్చి సమ్మర్ లో హీట్ పెంచడానికి రవితేజ ‘రావణాసుర’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీని టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న రావణాసుర సినిమా నుంచి ‘రావణాసుర ఆంథెమ్’ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
శాంతి పీపుల్, నోవలిక్, హర్షవర్ధన్ రామేశ్వర్ కలిసి కంపోజ్ చేసిన ఈ రావణాసుర ఆంథెమ్ సాంగ్ ని హారిక నారాయణ్, హర్షవర్ధన్ రామేశ్వర్ లు పాడారు. ఒక స్తోత్రంలా ఈ సాంగ్ ని డిజైన్ చేసి కంపోజ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. హెడ్ ఫోన్స్ పెట్టుకోనో, హోమ్ థియేటర్ ఆన్ చేసుకోనో ఈ రావణాసుర ఆంథెమ్ సాంగ్ ని వింటే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. రావణాసుర సినిమాలో థీమ్ సాంగ్ గా వచ్చే ఛాన్స్ ఉన్న రావణాసుర ఆంథెమ్ సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇకపై అన్ని పబ్స్ లో ఈ సాంగ్ రీసౌండ్ వచ్చే రేంజులో వినిపించడం ఖాయం. భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా వర్క్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో రవితేజతో పాటు సుశాంత్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.
Presenting the #Ravanasura Anthem🔥
Beautifully composed by @rameemusic and performed by @shanti_people #Novlik @HarikaNarayan 🤗
▶️https://t.co/XNJr9DrEDK@sudheerkvarma @AbhishekPicture @RTTeamWorks @saregamasouth pic.twitter.com/ZH2gDG855x
— Ravi Teja (@RaviTeja_offl) February 6, 2023