మాస్ మహరాజా వెనుక పది లక్షల మంది…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహరాజా రవితేజ మొదటి నుండీ పబ్లిక్ కు కాస్తంత దూరంగానే ఉంటాడు. అలానే ఫ్యాన్స్ తో కలిసి హంగామా చేయడం కూడా తక్కువే. నిజానికి తన సినిమాలు విడుదలైనప్పుడు భారీ ప్రచారానికీ రవితేజ పెద్దంత ఆసక్తి చూపించే వాడు కాదు. కానీ ఇప్పుడు ఈ మాస్ మహరాజా రూట్ మార్చాడు. లోకం పోకడ తెలుసుకుని మెసులుకోవడం మొదలెట్టాడు. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా ఇవ్వడం ప్రారంభించాడు. చిత్రసీమలోనూ బయటా జరుగుతున్న సంఘటనల పట్ల స్పందిస్తున్నాడు. దీంతో ట్విట్టర్ లో రవితేజాను ఫాలో అవుతున్న వారి సంఖ్య అక్షరాల పది లక్షలు అంటే ఒక మిలియన్ కు చేరింది.
చిత్రం ఏమంటే రవితేజా మాత్రం కేవలం ఇద్దరినే ఫాలో అవుతున్నాడు. అందులో ఒకరు అతను అభిమానించి, ఆరాధించే అమితాబ్ బచ్చన్ కాగా, మరొకరు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఇదిలా ఉంటే, మొన్నటి వరకూ ఆచితూచి సినిమాలను అంగీకరించిన రవితేజ ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. ‘ఖిలాడీ’ మూవీ విడుదల సిద్ధం కాగా, ‘థమాకా, రామారావ్ ఆన్ డ్యూటీ’ సెట్స్ పై ఉన్నాయి. దీనితో పాటు ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు చేయబోతున్నట్టు రవితేజ ప్రకటించాడు. సో… రెండేళ్ళ పాటు రవితేజ యమా బిజీ అనే చెప్పాలి.
Also Read
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
- RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
- Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
- Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
తాజావార్తలు
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!