Irumudi: ఇరుముడిపై టాక్సిక్ ఎఫెక్ట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు వరుస హిట్స్‌తో మాస్ ఆడియన్స్‌కు ఫేవరెట్‌గా నిలిచిన రవితేజ ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో కాస్త డౌన్‌ఫాల్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’ కేవలం మరో సినిమా కాదు, రవితేజ కెరీర్‌కు చాలా కీలకమైన రికవరీ మూవీ. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రవితేజ ఒక హింసాత్మక గతం ఉన్న తండ్రి పాత్రలో కనిపిస్తున్నాడు. కూతురి కోసం అయ్యప్ప దీక్ష తీసుకునే తండ్రి, ఆ తర్వాత తన కుటుంబాన్ని, ఊరి ప్రజలను కాపాడేందుకు చేసే పోరాటం కథలో ప్రధాన అంశంగా ఉందనిపిస్తుంది. అంటే మాస్ ఇమేజ్‌తో పాటు ఎమోషన్, భక్తి, ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా టార్గెట్ చేసే కంటెంట్ ఇది.
ఇది వర్కవుట్ అయితే రవితేజకు మళ్ళీ ఫ్యామిలీ ప్లస్ మాస్ ఆడియన్స్‌లో బలమైన కనెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ అయిన ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. అయ్యప్ప భక్తి, తండ్రి కూతురు ఎమోషన్… ఇవి సినిమాకు ఒక పాజిటివ్ టోన్‌ను తీసుకొస్తున్నాయి. కానీ బాక్సాఫీస్‌లో ఒక సాంగ్ లేదా ట్రైలర్ రెస్పాన్స్‌తో మాత్రమే సినిమా నిలబడదు. ముఖ్యంగా రవితేజకి ఇప్పుడు కావాల్సింది మంచి ఓపెనింగ్స్‌తో పాటు స్ట్రాంగ్ మౌత్ టాక్. ఎందుకంటే సినిమా మొదటి రెండు మూడు రోజుల్లోనే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవాలి. లేకపోతే నెక్స్ట్ మూవీ రిలీజ్ ప్రభావం మొదలవుతుంది. అంటే ‘ఇరుముడి’కి టాక్ రావడం ఎంత ముఖ్యమో, ఆ టాక్ ఎంత వేగంగా రావాలన్నది కూడా అంతే ఇంపార్టెంట్ అని ట్రేడ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
Also Read
‘ఇరుముడి’ రిలీజ్‌కి ముందు రోజే పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్‌లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఖలీఫా’ కూడా బరిలో ఉంది. అయితే ప్రస్తుతం ఆ సినిమాకు ఉన్న హైప్‌ను బట్టి చూస్తే ‘ఇరుముడి’కి పెద్ద స్పీడ్ బ్రేకర్ అయ్యే స్థాయిలో కనిపించడం లేదు. కానీ అసలు సమస్య మాత్రం ‘టాక్సిక్’. ‘ఇరుముడి’ ఆగస్టు 21న రిలీజ్ అవుతుంటే, కేవలం ఐదు రోజుల తర్వాత యశ్ నటించిన ‘టాక్సిక్’ థియేటర్లలోకి వస్తుంది. అంటే ‘ఇరుముడి’కి ఫుల్‌గా రెండు వారాల లాంగ్ రన్ కూడా దక్కే పరిస్థితి లేదు. ‘టాక్సిక్’కి యశ్ మార్కెట్, కేజీఎఫ్ తర్వాత వచ్చిన పాన్ ఇండియా క్రేజ్, భారీ విజువల్ స్కేల్ ఉన్నాయి.
ఇలాంటి సినిమాకు థియేటర్లు, షోలు పెంచాల్సి వస్తే ‘ఇరుముడి’ ఎలాంటి పొజిషన్లో నిలబడుతుంది అన్నది కీలకంగా మారుతుంది. ‘ఇరుముడి’ కథలో భక్తి ఉంది, ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, యాక్షన్ కూడా ఉంది. కాబట్టి కంటెంట్ క్లిక్ అయితే ఈ సినిమాకు మంచి లాంగ్ రన్ వచ్చే అవకాశం ఉంది. కానీ బాక్సాఫీస్ లెక్కల్లో మాత్రం టైమింగ్ చాలా కీలకం. మొదటి వీకెండ్లోనే రవితేజ తన మార్కెట్‌ను తిరిగి సంపాదించాలి. రిలీజ్ నుంచి కలెక్షన్లు డ్రాప్ కాకుండా స్ట్రాంగ్ హోల్డ్ చూపించాలి. అప్పుడే ‘టాక్సిక్’ వచ్చినా ‘ఇరుముడి’ తన థియేటర్లను నిలబెట్టుకోగలదు. లేకపోతే ‘టాక్సిక్’ భారీ ఓపెనింగ్‌తో వస్తే స్క్రీన్ల విషయంలో ‘ఇరుముడి’కి ప్రెజర్ తప్పదు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!