ప్రభాస్… ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సలార్ సీజ్ ఫైర్. ప్రభాస్ కంబ్యాక్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఎండ్ లో పార్ట్ 2కి లీడ్ ఇస్తూ… శౌర్యాంగ పర్వం అనౌన్స్ చేసారు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ పార్ట్ 2కి ఏ రేంజ్ యాక్షన్ సినిమా చూపించబోతున్నారు అని మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదే దారిలో వెళ్తుంది ఈగల్ సినిమా. మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ సెంట్రిక్ డ్రామా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సింది.. కానీ పోటీలో నుంచి రవితేజ స్వచ్ఛంధంగా తప్పుకోని మిగిలిన సినిమాలకి థియేటర్స్ ఇచ్చాడు. ఫిబ్రవరి 9న సోలోగా థియేటర్స్ లోకి వస్తాను అని చెప్పిన రవితేజ… చెప్పినట్లుగానే ఈరోజు ప్రేక్షకులని పలకరించడానికి థియేటర్స్ లోకి వచ్చేసాడు.
రవితేజ మస్త్ ఉన్నాడు, సహదేవ్ వర్మగా అదరగొట్టాడు… అంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత రవితేజ సినిమాలకి ఇంత పాజిటివ్ టాక్ రావడం ఇదే మొదటిసారి. రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో డిజప్పాయింట్ చేసిన రవితేజ ఈగల్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేశాడని అంటున్నారు. ముఖ్యంగా కాస్త తడబడిన ఫస్ట్ హాఫ్ తర్వాత సాలిడ్ సెకండ్ హాఫ్ ని ఇచ్చిన కార్తీక్ ఘట్టమనేని-రవితేజ ఆడియన్స్ ని మంచి జోష్ లో థియేటర్స్ నుంచి బయటకి పంపించారని సోషల్ మీడియా టాక్. అయితే సలార్ దారిలో నడుస్తూ ఈగల్ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుందని ఎండ్ లో రివీల్ చేశారట. ఈగల్ 2-యుద్ధకాండ అనే టైటిల్ పడడంతో సీక్వెల్ రాబోతుందని మాస్ మహారాజా అభిమానులు సందడి చేస్తున్నారు. ఈగల్ కి అన్ని సెంటర్స్ నుంచి హిట్ టాక్ వస్తే పార్ట్ 2 త్వరగానే సెట్స్ పైకి వెళ్తుంది.