Raviteja: ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి మాములుగా ఉండదు. స్టార్ హీరోల సినిమా అయినా చిన్న హీరోల సినిమా అయినా ప్రేక్షకులు శుక్రవారం సినిమా చూడకుండా మాత్రం ఉండరు. శుక్రవారం స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే.. సోమవారం నుంచి ప్రమోషన్స్ తో సోషల్ మీడియా హీటెక్కిపోతూ ఉంటుంది. ఇక రేపు శుక్రవారం కూడా రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. తెలుగులో మాస్ మహారాజా రవితేజ ఈగల్ అయితే.. తమిళ్ లో రజినీకాంత్ లాల్ సలాం. రెండు సినిమాలు రెండు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. అయితే నిజం చెప్పాలంటే.. రేపు ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న మాటే కానీ, కొంచెం కూడా బజ్ లేదు. కనీసం రవితేజ ఈగల్ రిలీజ్ అవుతుంది అన్న విషయమైనా తెలుసు కానీ, అసలు రజిని సినిమా రేపు రిలీజ్ అవుతుందన్న విషయమే సగం మంది ప్రేక్షకులకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
మాస్ మహారాజా రవితేజ ఈగల్.. సంక్రాంతికి రావాల్సి ఉండగా.. సోలో రిలీజ్ ఇస్తామని ఫిల్మ్ ఛాంబర్ మాట ఇవ్వడంతో వెనక్కి తగ్గాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఫిల్మ్ ఛాంబర్ ఫిబ్రవరి 9 న ఈగల్ కు ఇచ్చింది. ఇక డబ్బింగ్ సినిమాగా లాల్ సలాం రిలీజ్ అవుతుంది. ఎంత డబ్బింగ్ అన్నా కూడా రజిని సినిమా అంటే వుండే ఊపు, హైప్ ఏది ఈ సినిమాకు లేదు. మేకర్స్ సైతం తమిళ్ లో చేసినంత ప్రమోషన్స్ తెలుగులో చేయలేదు. ఇక బుకింగ్స్ లో రవితేజ.. రజిని ఓవర్ టేక్ చేశాడు. లాల్ సలాం కన్నా ఈగల్ ఎక్కువ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇక రెండు సినిమాల గురించి మాట్లాడుకుంటే.. మునుపెన్నడూ చూడని ఊర మాస్ అవతార్ లో రవితేజ కనిపిస్తున్నాడు. ఈ సినిమాపై రవితేజ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక లాల్ సలాం లో రజిని మొయిద్దీన్ భాయ్ గా కనిపించనున్నాడు. రజినీ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం రజిని కూతురు సౌందర్య కావడం విశేషం. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలంటే రేపటివరకు ఆగాల్సిందే.