2024 సంక్రాంతి సినిమాల రేస్ నుంచి తప్పుకోని మహారాజా రవితేజ చాలా మంచి పని చేసాడు. కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ ఈగల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి. పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ మేకర్స్ సందడి చేస్తూ ఫిబ్రవరి 9న రిలీజ్ కి రెడీ అవుతున్నారు. అయితే సంక్రాంతి నుంచి తప్పుకున్న సినిమాకి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ నుంచి సోలో రిలీజ్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం అనే మాటలు చెప్పారు. ఈగల్ విషయంలో ఇదేమి జరుగుతున్నట్లు కనిపించట్లేదు. ఈ రిలీజ్ డేట్ కే రావాల్సిన డీజీ టిల్లు 2 మూవీ వెనక్కి వెళ్లింది కానీ యాత్ర 2, ఊరిపేరు భైరవకోన, లాల్ సలామ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో నాలుగు సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ అవ్వడం అనేది ఏ సినిమాకైనా రిస్క్ ఫ్యాక్టరే. ఫిబ్రవరి 9న కూడా థియేటర్స్ ఇష్యూ టాపిక్ వచ్చి అప్పుడు కూడా ఎవరైనా వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి రిలీజ్ అంటేనే మాస్ మహారాజా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఫిబ్రవరి నెల కూడా రవితేజకి అసలు కలిసి రాదు. ఇప్పటివరకూ ఫిబ్రవరి నెలలో రిలీజైన ఏ రవితేజ సినిమా హిట్ అయిన హిస్టరీనే లేదు. దీంతో ఫెబ్ 9న రానున్న ఈగల్ సినిమా రిజల్ట్ ఏమవుతుందో అనే ఆలోచనలో ఉన్నారు రవితేజ ఫ్యాన్స్. గతంలో ఇదే ఫిబ్రవరి 9న షాక్ సినిమా, ఫిబ్రవరి 2న నిప్పు, అదే ఫిబ్రవరి 2న టచ్ చేసి చూడు, ఫిబ్రవరి 11న ఖిలాడీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఒక్కటి కూడా రవితేజకి హిట్ ఇవ్వలేకపోయాయి. ఇంత నెగటివ్ సెంటిమెంట్ ఉన్న ఫిబ్రవరిలో ఈగల్ సినిమాని రిలీజ్ చేస్తుండడంతో రవితేజ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.