Changure Bangaru Raja: సందు చూసి పండక్కి సినిమా దింపుతున్న రవితేజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Teja’s RT Teamworks – Satish Varma’s Changure Bangaru Raja Releasing: మాములుగా సినిమాలకి పండగలు బాగా వర్కౌట్ అవుతాయి. శుక్రవారానికి ఒకట్రెండు రోజులు అటూ ఇటుగా ఏదైనా పండుగ వస్తుంది అంటే ఆ పండుగ రోజున సినిమా రిలీజ్ చేసి సెలవులు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక రాబోతున్న వినాయక చవితి విషయంలో కూడా అదే జరిగింది. ఈ వినాయక చవితికి ముందుగా స్కంద, టిల్లు స్క్వేర్ అనే రెండు సినిమాలను సెప్టెంబర్ 15న రిలీజ్ చేయాలని నిర్మాణ సంస్థలు ఎప్పుడో కర్చీఫ్ వేసుకున్నాయి. ఇక అదే టైముకు మార్క్ ఆంటోనీ, చంద్రముఖి 2 అనే రెండు తమిళ సినిమాలను కూడా తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని అనుకున్నారు.
Samantha: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి సమంత రివ్యూ.. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా లేదంటూ!
Also Read
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
అలాగే రామన్న యూత్ అనే ఒక చిన్న తెలుగు సినిమా కూడా డేట్ సెట్ చేసుకుంది. అయితే చంద్రముఖి 2, స్కంద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి చంద్రముఖి 2ని ఆపలేక స్కందను వెనక్కి పంపి 28న రిలీజ్ డేట్ అనౌన్స్ చేయించారు. ఇక ఇప్పుడు చంద్రముఖి 2 రిలీజ్ డేట్ అనుకోని కారణాలతో 28కి వాయిదా పడింది. మార్క్ ఆంటోనీకి కోర్టు బ్రేక్ వేసింది, రిలీజ్ చేయగలరో లేదో చూడాలి. అయితే ముందే టిల్లు స్క్వేర్ వాయిదా వేయడంతో ఇప్పుడు కేవలం రామన్న యూత్ అనే చిన్న సినిమా మాత్రమే బరిలో ఉన్నట్టు అయింది, ఈ క్రమంలో హీరో రవితేజ ఒక ఇంట్రెస్టింగ్ నిర్ణయం తీసుకున్నాడు. మాస్ మహారాజా రవితేజ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్స్ నుంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ రాబోతోంది.
సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ‘ఛాంగురే బంగారురాజా’ ప్రేక్షకుల ముందుకు రానుందని ఈసినిమా యూనిట్ ప్రకటించింది. ‘C/o కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్ గా నటించింది. రవిబాబు, సత్య ఈ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా టీజర్‌ను గతంలోనే విడుదల చేసారు. ఈ సినిమాకి కృష్ణ సౌరభ్ సంగీతం సమకూరుస్తుండగా, సుందర్ ఎన్‌సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక రిలీజ్ కి వారం కూడా లేకపోవడంతో త్వరలో ‘ఛాంగురే బంగారురాజా’ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?