Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Ravi Teja Venkatesh Multi Starer Movie

Ravi Teja- Venkatesh : మరో భారీ మల్టీ స్టారర్..!

Published Date :June 21, 2022 , 3:03 pm
By Subbarao N
Ravi Teja- Venkatesh : మరో భారీ మల్టీ స్టారర్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

 

ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్‌లో మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు స్టార్ హీరోలు. ఈ నేపథ్యంలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ తెరపైకొస్తున్నాయి. అందులోభాగంగా.. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ-విక్టరీ వెంకటేష్ హీరోలుగా.. ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా రాబోతోందని తెలుస్తోంది. అందుకోసం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రంగం సిద్దం చేస్తున్నాడట. గతంలో వెంకటేష్, మహేష్ బాబుతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాను మల్టీస్టారర్‌గా తెరకెక్కించి మెప్పించాడు శ్రీకాంత్. ఇక చివరగా తమిళ్ మూవీ అసురన్‌ను తెలుగులో వెంకీతోనే నారప్పగా రీమేక్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత మరో సినిమా ప్రకటించలేదు శ్రీకాంత్ అడ్డాల.

అయితే తాజాగా రవితేజ-వెంకీ కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వెంకటేష్‌కు కథ చెప్పాడని, వెంకీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. త్వరలోనే రవితేజకు కూడా కథ వినిపించబోతున్నాడట. ఇక ఈ కాంబినేషన్‌ను తెరపైకి తీసుకు రావడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఈ వార్తల్లో క్లారిటీ లేకపోయినా.. ఈ క్రేజీ కాంబినేషన్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మారింది. కానీ ఇప్పట్లో ఈ సినిమా ఉంటుందా.. అనే సందేహం రాక మానదు. ఎందుకంటే ప్రస్తుతం రవితేజ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘రామరావు ఆన్ డ్యూటీ’ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అలాగే రావణసుర, ధమాకా, టైగర్ నాగేశ్వర్ రావు.. చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. వీటితో పాటు మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’లో కూడా నటిస్తున్నాడు. అంతేకాదు మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్స్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. వెంకీతో మల్టీ స్టారర్ ఇప్పట్లో సాధ్యమయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest movie news
  • Multi Starrer
  • Ravi Teja
  • Srikanth Addala
  • Venkatesh

తాజావార్తలు

  • Crime: భార్యను చంపి పరారీ.. LPG సిలిండర్ బుకింగ్‌లో పట్టుబడ్డ నిందితుడు..

  • Rajasekhar: యూవీ క్రియేషన్స్ అంటే రాయల్ ట్రీట్మెంటు.. బైకర్ అందుకే ఒప్పుకున్నా!

  • Mijia Smart IH Rice Doger P1 4L: షియోమి అద్భుతమైన కుక్కర్‌ విడుదల.. ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకు స్మార్ట్ సొల్యూషన్

  • Tovino Thomas: బాహుబలితో మాకు లేని ప్రాబ్లెమ్.. పళ్ళి చట్టంబితో మీకు వస్తోందా?

  • Indian Rupee: ఒకప్పుడు ఈ ముస్లిం దేశాలకు రూపాయే అధికారిక కరెన్సీ.. తర్వాత ఏం అయిందంటే!

ట్రెండింగ్‌

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions