Ravi Teja: ఇరుముడి జోష్‌లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?

Ravi Teja

Ravi Teja

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు షాకింగ్ న్యూస్. 2027 సంక్రాంతి బరిలో రవితేజ సినిమా ఉంటుందని ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రవితేజ, హసిత్ గోలి కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన #SVC64 ప్రాజెక్ట్ 2027 సంక్రాంతికి రావడం లేదని ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అసలు సినిమా ఆగిపోయిందా? లేక కేవలం పాజ్ బటన్ మాత్రమే పడిందా? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఇరుముడి’తో బాక్సాఫీస్ వద్ద మంచి జోష్‌లో ఉన్న మాస్ మహారాజా.. తన నెక్ట్స్ సినిమాను ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ బ్యానర్‌లో చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రవితేజ 64వ చిత్రంగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. విభిన్నమైన చిత్రాలతో తనదైన మార్క్ స్టైల్ చూపించిన హసిత్ గోలి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ సమయంలోనే 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు.. “దాగుడు మూతలు దండాకోర్.. ఎంటర్టైన్మెంట్ హార్డ్ కోర్” అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా, రవితేజ వింటేజ్ కామెడీ టైమింగ్‌ను మరోసారి చూపించేలా ఈ సినిమా ఉండబోతోందని టాక్ వచ్చింది. ‘వీరాధివీరులంట’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్లడం లేదని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా 2027 సంక్రాంతికి రవితేజ – హసిత్ గోలి సినిమా ఉండదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే సినిమా పూర్తిగా ఆగిపోయిందా? లేక కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా పాజ్ చేశారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో అధికారికంగా ప్రకటించిన సంక్రాంతి రిలీజ్‌పై కూడా సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం రవితేజ ‘ఇరుముడి’ సక్సెస్‌తో మంచి ఊపులో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన నెక్ట్స్ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి #SVC64 విషయంలో నిజంగా ఏం జరిగింది? అనేది తెలియాలంటే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.