Site icon NTV Telugu

Mass Jathara : రవితేజ ‘మాస్ జతర’ ట్రైలర్ రిలీజ్

Mass Jathara

Mass Jathara

Mass Jathara : మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న భారీ మూవీ మాస్ జాతర. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. భాను భోగవరపు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అక్బోటర్ 31న రిలీజ్ అవుతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ మరోసారి అదరగొట్టాడు. ఆయన ఇందులో ఒదిగిపోయిన తీరు కట్టిపడేసింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్ డైలాగ్‌లతో ఫ్యాన్స్ కోరుకునే మాస్ మేనియా ఇందులో కనిపిస్తోంది.

Read Also : Sree Leela : పవన్ సినిమా నెక్ట్స్ లెవల్ అంతే.. శ్రీలీల హింట్

యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కు ఏ మాత్రం లోటు లేదని ట్రైలర్ చూస్తుంటేనే అర్థం అవుతోంది. నవీన్ చంద్ర మరోసారి పవర్ ఫుల్ విలన్ రోల్ లో ఇందులో నటించాడు. శ్రీలీల పాత్ర కూడా ఎఫెక్టివ్ గానే ఉందని ఇందులో కనిపిస్తోంది. శ్రీకాకుళం యాసలో శ్రీలీల బాగానే అదరగొట్టింది. భీమ్స్ సిసిరోలియో బీజీఎం ఆకట్టుకుంటోంది. పోరాట సన్నివేశాలు, కడుపుబ్బా నవ్వించే హాస్యం, అద్భుతమైన పాటలతో ఈ సినిమాను రూపొందించినట్టు ట్రైలర్ చూస్తుంటేనే అర్థం అవుతోంది.

Read Also : Dhanya Balakrishna : అలాంటి సీన్లు చేయకపోతే కెరీర్ ఉండదు.. హీరోయిన్ కామెంట్స్

Exit mobile version