Rashmika: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం విదితమే. అయితే ఈ వెకేషన్ లో రష్మికతో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఆ పుకార్లకు ఆజ్యం పోసినట్లు రష్మిక, విజయ్ గాగుల్స్ తో ఫోటోలకు పోజులిస్తూ కనిపిస్తోంది. దీంతో ఈ జంట మాల్దీవుల్లో ఒక్కటిగానే ఉన్నారని వార్తలు వస్తున్నాయి. గీతా గోవిందం చిత్రం నుంచి వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులమని ఈ జంట చెప్తూనే ఉన్నారు. అయినా రెస్టారెంట్ లకు, డేట్స్ కు వెళ్తూ ప్రేమికులే అని అందరికి అనుమానం తెప్పిస్తున్నారు. ఇక మాల్దీవుల్లో రష్మిక అందాల ఆరబోత హద్దుదాటిందనే చెప్పాలి. బాలీవుడ్ పార్టీలో థైస్ కనిపిస్తేనే కొంచెం ఎబ్బెట్టుగా ఫీల్ అయిన ఈ అమ్మడు ఇప్ప్పుడు ఆ థైస్ నే వలగా విసిరుతోంది.
ఇక ప్రతి ఫోటోలో విజయ్ గాగుల్స్ ను మాత్రం వదలడం లేదు. ఒక పక్క రూమర్స్ వస్తున్నాయని, వీరిద్దరు జంటగానే మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారని సోషల్ మీడియా కోడై కూస్తున్నా అమ్మడు మాత్రం ఇంకా ఆ గాగుల్స్ తోనే దర్శనమిస్తోంది అంటే నిజంగానే తమ ఎఫైర్ ను లోకం మొత్తం చెప్పాలనుకుంటుందా..? వారి గురించి మాట్లాడుకోవాలనే ఆ ఫోటోలను పోస్ట్ చేస్తుందా..? అని నెటిజన్లు అయోమయంలో పడ్డారు. ఇక ఈ ఫోటోలపై మరికొంతమంది ఇప్పుడేంటి.. విజయ్ కు ఉన్న గాగుల్స్ లాంటివే రష్మిక కొన్నది ఏమో.. లేకపోతే విజయ్ గిఫ్ట్ ఇచ్చాడేమో అందులో తప్పేముంది. ఒక గాగుల్స్ ఆధారంగా చేసుకొని ఎఫైర్ అని ఎలా అనేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. నిప్పులేనిదే పొగ రాదు కదా బ్రదర్.. ఇద్దరు ఒకే చోటకు వెళ్లారు అని అందరికి తెల్సిందే.. ఎయిర్ పోర్టులోనే దర్శనమిచ్చారు గా ఇంకేంటి డౌట్ అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా ఇద్దరూ ప్రస్తుతం పరాజయాలను చవి చూసి రిలాక్స్ కోసం వెకేషన్ కు వెళ్లారు.. ఇప్పుడు ఈ ట్రోల్స్ ను, రూమర్స్ ను పట్టించుకొనే మూడ్ లో ఉండి ఉండరులే అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి వెకేషన్ నుంచి వచ్చాకైనా ఈ జంట తమ మధ్య ఉన్న బంధాన్ని బయటపెడతారో లేదో చూడాలి.