Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒక పక్క టాలీవుడ్ లో చేస్తూనే.. మరోపక్క అన్ని ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో అమ్మడు గుడ్ బై సినిమాతో బొక్కా బోర్లా పడింది. దీంతో మిషన్ మజ్ను కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అమ్మడి సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయ్యింది. గత కొన్నిరోజుల క్రితం రష్మిక- రిషబ్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెల్సిందే. కన్నడ బ్యూటీని ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ రిషబ్ శెట్టి.. అదేనండీ కాంతార హీరో. కిర్రాక్ పార్టీ సినిమాతో రష్మిక రేంజ్ ను మార్చేశాడు. అంత చేసినా రిషబ్ ను తీసిపారేసింది రష్మిక. ఒక ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ” కాలేజ్ సమయంలో నా ఫోటోలు టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ మీద వచ్చాయి. వాటిని చూసిన సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ నన్ను పిలిచి అడిగింది.. అసలు నేను పట్టించుకోలేదని” చెప్పుకొచ్చింది. ఇదుగో ఇక్కడే మొదలయ్యింది రచ్చ. రిషబ్.. తనను ఎంతో బాగా చూపించాడు. ఒక మంచి హిట్ ను అందించాడు.. అంత చేసినా అతడి పేరు చెప్పకుండా సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అని చెప్పడంతో అమ్మడిపై ట్రోల్స్ మొదలయ్యాయి. వీటికి ధీటుగా రిషబ్ కూడా సమాధానం ఇస్తూనే ఉన్నాడు.
ఇక కన్నడ ప్రైడ్ కాంతార సినిమాను చూడలేదని అగ్గికి ఆజ్యం పోసింది.. ఇక ఈ ఒక్క మాటతో అమ్మడిని ఇండస్ట్రీ నుంచి కూడా బయటికి పంపిచేయాలని కన్నడిగులు గొడవ చేశారు. ఇక ఇంత జరిగాకా అమందిలో కొంచెం రియలైజేషన్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకు కారణం తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక, రిషబ్ ను ఆకాశానికి ఎత్తేసింది. తెలుగు జర్నలిస్ట్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ” రక్షిత్, రిషబ్ వలనే నేను ఇక్కడ ఉన్నాను.. వారే లేకపోతే నాకు ఇంత పేరు వచ్చేది కాదు.. ఎప్పటికైనా వారికి నేను రుణపడి ఉంటాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక దీంతో మరోసారి నెటిజన్లు రష్మికను ఆడేసుకుంటున్నారు. ఏం పాప.. రిషబ్ కు భయపడినవా ఏంటి.. ఓ మోసేస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.