Rashmika Mandanna was cheated by her manager financially: కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న ఆ వెంటనే తెలుగులో చలో అనే సినిమాతో టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చలో సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు లభించాయి. ఆమె చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతూ రావడంతో ఆమెకు తెలుగులో గోల్డెన్ లెగ్ గా ముద్ర పడిపోయింది. అలా తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయిన తర్వాత ఆమెకు బాలీవుడ్ నుంచి కూడా వరుస అవకాశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తూ రష్మిక మందన్న బిజీ బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా రష్మిక మందన్న మోసపోయిందనే వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది. అసలు విషయం ఏమిటంటే రష్మిక మందన్న దగ్గర చాలా కాలం నుంచి అంటే ఆమె దాదాపుగా హీరోయిన్ అయినప్పటి నుంచి ఒక వ్యక్తి మేనేజర్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. Thamannah bhatia: బ్లాక్ ఔట్ ఫిట్లో తమన్నా సూపర్ హాట్ ట్రీట్
అయితే సదరు వ్యక్తి రష్మిక మందన్నకు తెలియకుండా 80 లక్షల రూపాయలు రష్మిక మందన్న నుంచి కాజేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయం తెలియడంతో రష్మిక మందన్న ఆయన మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని తెలుస్తోంది. తనను అడిగితే తానే ఇచ్చేదాన్ని కానీ ఇలా నమ్మకద్రోహం చేయడం ఏమాత్రం తనకు నచ్చలేదని చెప్పి క్షణాల వ్యవధిలోనే ఆమె తన మేనేజర్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలో అన్నిటికంటే నమ్మకద్రోహం దారుణమైన విషయం అని ఇక తన దగ్గర పని చేసే అవసరం లేదని చెబుతూ అతని ఆమె పంపేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం ఆఫ్ ది రికార్డుగా బయటకు వచ్చినా ఇప్పటివరకు ఈ విషయం మీద రష్మిక టీం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. నిజంగానే రష్మిక మందన్న మేనేజర్ చేతిలో మోసపోయిందా? లేక ఇదంతా వట్టి ప్రచారమేనా? అనే విషయం మీద రష్మిక స్పందిస్తే తప్ప పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.