Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉంది. మరి డబ్బులు బాగా సంపాదించిన తర్వాత వాటిని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ మెంట్ చేయాలి కదా.. ఇప్పుడు రష్మిక కూడా అదే బాట పట్టేసింది. ఇప్పటికే స్టార్ హీరోయిన్లు సమంత, నయన తార లాంటి వారు తాము సంపాదించిన కోట్ల రూపాయలను కొన్ని రకాల బిజినెస్ ల మీద ఇన్వెస్ట్ చేశారు. రష్మిక తాజాగా పర్ఫ్యూమ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డియర్ డైరీ పేరుతో ఈ కొత్త బ్రాండ్ ను స్టార్ట్ చేసింది. రెండు, మూడు రోజుల నుంచి తాను ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు రష్మిక చాలా సార్లు చెప్పింది. అది ఏంటా అని వెయిట్ చేయగా.. బిజినెస్ న్యూస్ చెప్పింది.
Read Also : Sukumar : సుకుమార్ లెక్కలను ఫాలో అవుతున్న డైరెక్టర్లు..!
ఈ డియర్ డైరీ అంటే బ్రాండో లేకపోతే బిజినెస్ పేరో కాదని.. ఇది తనలో భాగం అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇక పర్ఫ్యూమ్స్ విషయానికి వస్తే ఒక్కో బాటిల్ ధర రూ.1600 నుంచి రూ.2600 దాకా ఉంది. హీరోయిన్ గా సూపర్ సక్సెస్ అయిన రష్మిక.. మరి బిజినెస్ లో ఏ స్థాయి వరకు రాణిస్తుంది అనేది వెయిట్ చేయాలి. ఓ వైపు వరుస సినిమాలతో ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు మైసా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తోంది. రీసెంట్ గానే కుబేర మూవీతో భారీ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ఇంకోవైపు రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సినిమాల ద్వారా బాగానే సంపాదిస్తున్న రష్మిక.. ఆ డబ్బులను బిజినెస్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also : Ustad Bhagat Singh : అలా చేస్తే చట్టపరమైన చర్యలు.. వాళ్లకు ‘మైత్రీ’ వార్నింగ్..