Rashmika Mandanna ఇటీవల “ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమాతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ చిత్రీకరణకు సిద్ధమవుతన్న ఈ బ్యూటీ మరో యంగ్ హీరోతో రొమాన్స్ చేయబోతోందని బజ్. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మీద శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా రామ్ కి 20వ సినిమా. ఈ సినిమా అధికారిక ప్రకటన అయితే వచ్చింది. కానీ హీరో తప్ప మిగతా పాత్రలలో ఎవరు నటిస్తున్నారు అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Read Also : Bigg Boss Non Stop : నామినేషన్లలో 12 మంది… పక్కపక్కనే ఉంటూ గోతులు…
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టిన బోయపాటి శ్రీను సినిమాలో నటీనటులను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక నటిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఇప్పటికే రష్మికకు కథ చెప్పగా, ఆమె సూచనప్రాయంగా అంగీకారం తెలిపిందని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి రామ్ సినిమాలకు హిందీలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆయన చేసిన అన్ని డబ్బింగ్ సినిమాలు కూడా హిందీలో మిలియన్ల కొద్దీ అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా మార్కెట్ ను బేస్ చేసుకుని బోయపాటి శ్రీను ఈ సినిమా ప్లాన్ చేశారని, రష్మిక అయితే హిందీ ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది కాబట్టి ఆమెను తీసుకోవడమే బెటర్ అని భావిస్తున్నట్లు సమాచారం.