Site icon NTV Telugu

Rashmika Mandanna: అదంతా పచ్చి అబద్ధమంటూ ‘కొండ’ బద్దలు

Rashmika Item Song

Rashmika Item Song

ఇప్పుడు బారత చిత్రసీమలో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్‌లో రశ్మికా మందణ్ణ ఒకరు. అనతికాలంలోనే యువతలో భారీ క్రేజ్ సంపాదించుకోవడం, పాన్ ఇండియా నటిగా అవతరించడంతో.. మేకర్స్ ఈమె వెనకాలే పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఐటెం సాంగ్ కోసం రశ్మికాను సంప్రదించినట్టు కొన్ని రోజుల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏ సినిమాలో అనుకున్నారు..? డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాంబోలో రూపొందుతోన్న ‘జన గణ మన’.

ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పూరీ, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్‌గా రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే మాస్ ఆడియన్స్ కోసం ఓ ప్రత్యేకమైన ఐటెం సాంగ్ డిజైన్ చేశాడని, అందుకోసం రశ్మికాని రంగంలోకి దింపనున్నాడని ఈ న్యూస్ తెరమీదకొచ్చింది. విజయ్ దేవరకొండతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా.. ‘జన గణ మన’లో ఐటెం సాంగ్ చేసేందుకు రశ్మికా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా తేలిపోయింది. రశ్మికా ఒప్పుకోవడం కాదు కదా.. అసలు ‘జన గణ మన’లో ఐటెం సాంగే లేదని తెలిసింది.

‘‘జన గణ మన ఓ పేట్రియాటిక్ సినిమా. ఇలాంటి సినిమాల్లో ‘ఐటెం సాంగ్’ ఎలా పెడతారు? ఆ వార్తల్లో నిజం లేదు. ఇదో పూర్తిస్థాయి దేశభక్తి సినిమా మాత్రమే’’ అని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తొలుత ఈ చిత్రాన్ని మహేశ్ బాబుతో చేయాలని పూరీ అనుకున్నాడు. కానీ, ఎందుకో అది వీలు పడలేదు. చాలాకాలం నిరీక్షణ తర్వాత, ఇప్పుడు విజయ్‌తో రంగంలోకి దిగాడు పూరీ.

Exit mobile version