టాలీవుడ్ బ్యూటీ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ నిమిషం తీరిక లేకుండా తిరుగుతోంది. ఇక ఈ బిజీ షెడ్యూల్ ల్లో అమందు ప్రేమకు, పెళ్ళికి తావు లేవని చెప్పుకొస్తుంది. ఇక తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రమోషన్స్ లో ప్రేమ, పెళ్లి పై అమ్మడు నోరు విప్పింది. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ” ఎవరి దగ్గర అయితే సెక్యూర్ గా ఫీల్ అవుతామో, కంఫర్ట్ గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటాం అనిపిస్తుందో అతడే జీవితంకు మంచి లైఫ్ పార్టనర్.. అలాంటి వాడేనే భర్త గా ఎంచుకుంటానని చెప్పుకొచ్చింది.
ఇక ప్రేమ పెళ్లిపై అమ్మడు మాట్లాడుతూ ” ఇద్దరు వ్యక్తులు సమన్మగా అర్ధం చేసుకున్నప్పుడు మాత్రమే అది లవ్ అవుతుంది.. అలాకాకుండా ఒకరిని ఒకరు అర్ధం చేసుకోలేనప్పుడు అది వన్ సైడ్ లవ్ గానే ఉంటుంది.. లవ్ మ్యారేజ్ చేసుకొన్నా.. ఇంట్లోవారిని ఒప్పించే చేసుకుంటానాని మనసులో మాట చెప్పుకొచ్చింది. ఇక రష్మిక గత కొన్ని రోజుల నుంచి విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. అయితే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొస్తున్నారు. మరి వీరి రేలషన్ ఏంటి అనేది తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరికి పెళ్లి అయితే తప్ప చెప్పలేమంటున్నారు అభిమానులు.
