Rashmika Mandanna: పాన్ ఇండియా బాక్సాఫీస్ క్వీన్‌గా రష్మిక.. 4,000 కోట్లకు పైగా వసూళ్లతో అరుదైన ఘనత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna : ఒకప్పుడు కన్నడ చిత్రసీమ నుంచి సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రష్మిక మందన్న, ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న కథానాయికల్లో ఒకరిగా నిలిచింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరోయిన్, తన కెరీర్లో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించడమే కాదు, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే చిత్రాల్లో కీలక భాగంగా మారింది. దీంతో రష్మిక పేరు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా బలంగా వినిపిస్తోంది. అయితే ఆమె సాధించిన ఈ విజయాల వెనుక ఉన్న అసలు బలం ఏమిటి? వరుసగా ఇంత పెద్ద బ్లాక్బస్టర్లు ఎలా సాధ్యమయ్యాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు సినీ అభిమానుల్లో కూడా ఆసక్తిని పెంచుతున్నాయి.
రష్మిక కెరీర్లో అతిపెద్ద మైలురాయిగా నిలిచింది ‘పుష్ప 2’. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,871 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో శ్రీవల్లి పాత్రతో రష్మిక మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతకుముందు వచ్చిన ‘పుష్ప’ కూడా దాదాపు రూ.368 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆమెకు పాన్ ఇండియా గుర్తింపు తీసుకొచ్చింది.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తెలుగుతో పాటు హిందీలోనూ రష్మిక తన సత్తా చాటింది. రణబీర్ కపూర్‌తో కలిసి నటించిన ‘యానిమల్’ ప్రపంచవ్యాప్తంగా రూ.917 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, ‘ఛావా’ రూ.807 కోట్ల మార్క్‌ను దాటింది. తమిళంలో విజయ్ సరసన నటించిన ‘వరిసు’ రూ.306 కోట్లకు పైగా వసూలు చేసింది. మహేష్ బాబుతో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అలాగే ‘థామా’ రూ.187 కోట్లు, ‘కుబేరా’ రూ.138 కోట్లు, ‘గీత గోవిందం’ రూ.130 కోట్లు, ‘సీతా రామం’ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆమె సాధించిన విజయాలను చెప్పకనే చెబుతున్నాయి.
అయితే రష్మిక ప్రయాణం కేవలం కమర్షియల్ విజయాలకే పరిమితం కాలేదు. ‘డియర్ కామ్రేడ్’, ‘భీష్మ’, ‘గుడ్‌బై’ వంటి చిత్రాల్లో ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ తన నటనతో ఆకట్టుకుంది. మాస్ ఎంటర్టైనర్ అయినా, కంటెంట్ ఆధారిత సినిమా అయినా తాను ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయగలనని నిరూపించుకుంది. అందుకే దర్శకులు, నిర్మాతల చూపు మొదటగా ఆమె మీదే ఉంటుంది.
ఇప్పుడు రష్మిక చేతిలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్కో సినిమా విడుదలవుతున్న కొద్దీ ఆమె మార్కెట్ మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన ప్రధాన చిత్రాల మొత్తం బాక్సాఫీస్ వసూళ్లు రూ.4,000 కోట్లకు మించి ఉండటం ఆమె స్టార్డమ్కు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రాంతీయ హీరోయిన్గా మొదలైన ప్రయాణం, నేడు పాన్ ఇండియా బాక్సాఫీస్ క్వీన్ స్థాయికి చేరుకోవడం వెనుక ఆమె కృషి, కథల ఎంపిక, విభిన్న పాత్రలపై చూపిన ఆసక్తి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ప్రేక్షకులు కూడా ఆమె తదుపరి చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Tags
- cinema
- Rashmika Mandanna
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?