Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎక్కడుంటే అక్కడ సందడే. తాజాగా ‘ఎపిక్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ బ్యూటీ, తనదైన చలాకీతనంతో వేదికపై ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా యువ హీరో ఆనంద్ దేవరకొండపై ఆమె చూపించిన ప్రేమ, అతన్ని ముద్దుగా “ఆనందా” అని పిలిచిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆనంద్ దేవరకొండతో తనకున్న అనుబంధాన్ని రష్మిక వేదికపై పంచుకుంటూ మురిసిపోయింది. “నిన్నే ఆనంద్ నాకు మెసేజ్ చేసి ఈవెంట్ కి రమ్మన్నాడు. నేను హైదరాబాద్‌లోనే ‘రెయిన్ బో’ షూటింగ్లో ఉన్నాను కాబట్టి వెంటనే వచ్చేసాను. ఐ జస్ట్ లవ్ థిస్ బాయ్.. అతను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. తను చేసే ప్రతి సినిమా, బిజినెస్ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను” అంటూ ఆనంద్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ఆనంద్ చాలా స్మార్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ అని, ఇంటర్వ్యూలలో అతను అంత స్పష్టంగా, చక్కగా మాట్లాడుతుంటే తనకు కుళ్లుగా (ఎన్వియస్) అనిపిస్తుందని సరదాగా వ్యాఖ్యానించింది. ఈవెంట్ చివర్లో యాంకర్ సైతం “రష్మిక గారు ఆనంద్‌ని ఎంత ముద్దుగా ఆనందా అని పిలుస్తున్నారో” అని కామెంట్ చేయడం విశేషం.
‘ఎపిక్’ ట్రైలర్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా కథ గురించి తనకు ఎలాంటి ఐడియా లేదని, మీతో పాటే వేదికపైనే తొలిసారి ట్రైలర్ చూశానని తెలిపింది. చూడగానే తనకు ఒక పర్ఫెక్ట్ రొమాంటిక్ కామెడీ కొరియన్ డ్రామా (కే-డ్రామా) చూస్తున్న ఫీలింగ్ కలిగిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి ఫీల్ గుడ్ రామ్-కామ్ మూవీలు రావడం, వర్కౌట్ అవ్వడం చాలా కష్టమని, ఈ సినిమా ఆ మ్యాజిక్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. హీరోయిన్ వర్షు క్యారెక్టర్‌ను అత్యద్భుతంగా డిజైన్ చేశారని ఆనంద్ తనకు ముందే చెప్పాడని, తెరపై ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా పవర్ ఫుల్ గా ఉందంటూ రష్మిక ప్రశంసించింది. మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి మంచి క్యారెక్టర్స్ రాస్తున్నందుకు సంతోషంగా ఉందంది. అలాగే ఎప్పుడూ ఎంతో షైగా కనిపించే ఆదిత్య ఈ ట్రైలర్ లో మాత్రం కల్చరల్ షాక్ ఇచ్చేలా వైల్డ్ గా కనిపించాడని మెచ్చుకుంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా కోసం తనతో కలిసి పనిచేస్తున్న సంగీత దర్శకుడు హేశాంత్ తో తనకున్న పరిచయాన్ని గుర్తుచేసుకున్న రష్మిక.. సీనియర్ నటుడు శివాజీని ఈ వేదికపై కలవడం ఆనందంగా ఉందని తెలిపింది. చివరగా ‘రెయిన్ బో’ సినిమా అప్డేట్ అడుగుతున్న ఫ్యాన్స్ కు.. షూటింగ్ జరుగుతోందని సరదాగా సమాధానమిస్తూనే, తన ఫోకస్ మొత్తం ఇప్పుడు ‘ఎపిక్’ పైనే ఉందంటూ హుందాగా వ్యవహరించింది. సెప్టెంబర్ 10న ప్రీమియర్స్, 11న థియేటర్లలో విడుదల కాబోతున్న ‘ఎపిక్’ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కొరియన్ హార్ట్ సింబల్ తో ఈవెంట్ ను ముగించింది.
Also Read
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Krishnam Bhaje: మార్కండేయుడిగా బ్రహ్మాజీ.. 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్ అవుట్!
- Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
- Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!