Rashmi Gautam: జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఒకపక్క షోస్.. ఇంకోపక్క సినిమాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఇక అమ్మడి అందాల ఆరబోత గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో, జబర్దస్త్ షోలో రష్మీ అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మధ్యనే భోళా శంకర్ సినిమాలో చిరు సరసన కనిపించి మెప్పించిన ఈ భామ.. తాజాగా బాయ్స్ హాస్టల్ సినిమాలో ఒక క్యామియో రోల్ లో నటించింది. కన్నడ లో హిట్ టాక్ తెచ్చుకున్న బాయ్ హాస్టల్ సినిమాను తెలుగులో చాయ్ బిస్కెట్ ఫేమ్, మేము ఫేమస్ నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారు. నిన్ననే ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో తెలుగువారికి నచ్చేలా రష్మీ, తరుణ్ భాస్కర్ వెర్షన్ ను యాడ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రష్మీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యింది. ఇక ఈ భామ దొరకడం ఆలస్యం.. బాయ్ ఫ్రెండ్స్, ప్రేమ విషయాల గురించి చెప్పమని రిపోర్టర్స్ ఏకరువు పెట్టేశారు.
Mahesh Babu: ఇప్పుడు కూడా చేయకపోతే సినిమా రిలీజ్ అవ్వదు బ్రో..
బాయ్స్ హాస్టల్ లో బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా.. ? అన్న ప్రశ్నకు రష్మీ మాట్లాడుతూ.. ” నేను అసలు హాస్టల్ లోనే చదువు కోలేదు. ఇప్పుడు ఉన్న బాయ్ హాస్టల్ లో బాయ్స్ కు నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది. కష్టం. ఇక బాయ్ హాస్టల్ ఫేజ్ దాటేసి వచ్చినవాళ్లు అయితే ఇప్పుడు ఎవరు లేరు ” అని చెప్పుకొచ్చింది. ఇక హార్ట్ బ్రేక్ ఎన్ని జరిగాయి అన్న ప్రశ్నకు.. ” ప్రతి ఒక్కరి జీవితంలో హార్ట్ బ్రేక్, రిలేషన్స్ చాలా జరుగుతాయి. 16 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు చాలామంది వీటిని చూస్తూనే ఉంటారు. ఇక నా హార్ట్ బ్రేక్స్ గురించి కౌంట్ చేసి చెప్పడం కష్టం” అంటూ మాట దాటేసింది. దీంతో ఈ భామకు చాలానే హార్ట్ బ్రేక్స్ జరిగాయని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో రష్మీకి ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.