Rashmi Gautam Comments on Infant Death Due to Dog: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నటి, యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా చేసిన ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఒక పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన తెలంగాణలోని తాండూర్ లో జరిగింది. దీంతో వెంటనే ఆ కుక్కని తల్లిదండ్రులు కొట్టి చంపేశారు, ఇక ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక నిటిజన్ ఇప్పుడు ఆ కుక్కని చంపినందుకు చిన్నారి తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని రశ్మి అంటుందంటూ కామెంట్ చేశాడ. ఆ కామెంట్ కి స్పందిస్తూ రష్మీ సుదీర్ఘమైన ట్వీట్ చేసింది. అసలు ఆ చిన్నారిని ఎందుకలా వదిలేశారు? కుక్క దాడి చేస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు నిద్రపోతున్నారా? కనీసం బాబు ఏడుపు కూడా వినిపించలేదా? అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. జంతువుల మీద ఇలాంటి ప్రచారం చేయొద్దు, తెలివి తక్కువగా వ్యవహరించే తల్లిదండ్రులకు సంబంధించిన వెయ్యి వీడియోలు నేను కూడా షేర్ చేస్తాను. అసలు నిజానికి పిల్లలు జీవితాన్ని రిస్క్లో పెట్టింది ఆ తల్లిదండ్రులే కదా. జంతువుల విషయానికొస్తే ఈ లాజిక్స్ అన్ని మరిచిపోతారా అంటూ ఆమె కామెంట్ చేసింది.
AP Elections 2024: అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగిన ఓటింగ్.. తుది పోలింగ్ శాతం ఎంతంటే?
ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేసి మీరు మాత్రం ప్రశాంతత పొందాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదని ఆమె కామెంట్ చేసింది. ఇక ఈ స్పందనకు మరొక నెటిజెన్ స్పందిస్తూ మీకు బుర్ర లేదని అర్థమైంది ఇలా అంటున్నందుకు తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ కామెంట్ చేయగా దానికి ఆమె స్పందిస్తూ నాకు బుర్ర లేదు కానీ మీకు ఉంది కదా కనడమే కాదు, ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే, దయచేసి పెంపుడు జంతువులు ఉన్న వాళ్ళు పిల్లల్ని అలా వదిలేయొద్దు అని ఆమె కామెంట్ చేసింది. ఇక 24 గంటలు పిల్లలతోనే ఎవరు ఉండలేరు, రేపు మీరు కూడా ఉండలేరు అని ఒకరు కామెంట్ చేస్తే, మీరన్నది నిజమే అనుకోకుండా జరుగుతాయి కానీ ఏది ఒకే నిమిషంలో జరగదు. తల్లిదండ్రులు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా చూడాలంటూ రష్మి సమాధానం ఇచ్చింది. బయట వ్యక్తుల మీద దాడి చేయకుండా పెంపుడు జంతువులకు యజమానులు తగిన శిక్షణ ఇవ్వాలని, దాడి జరిగితే జంతువు యజమాని మీద కూడా కేసు పెట్టేలాగా చట్టాలు తీసుకురావాలన్నట్లు ఆమె కామెంట్ చేసింది. ఇక ఈ అంశం మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.