Rashi Singh: అనుకోకుండా ఆడిషన్ కి వెళ్లి పర్ఫెక్ట్ ఛాయిస్ అయ్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashi Singh Interview for Bhoothaddam Bhaskar Narayana Movie:శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రంలో హీరోయిన్ గా నటించిన రాశి సింగ్ విలేఖరుల సమావేశంలో భూతద్ధం భాస్కర్ నారాయణ విశేషాలు పంచుకున్నారు.
మీకు సినిమాలపై ఆసక్తి ఎప్పడు ఏర్పడింది ?
మాది రాయ్ పూర్. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నాను. పరిశ్రమలోకి వచ్చే ముందు ఏడాది కాలం పాటు ఎయిర్ హోస్టెస్ గా ఉద్యగం కూడా చేశాను. అయితే చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి వుంది. చిన్నప్పుడే హీరోయిన్ అయిపోవాలని బలంగా కోరుకున్నాను(నవ్వుతూ). చాలా హార్డ్ వర్క్ చేసి సినిమాల్లోకి వచ్చాను. సంతోష్ శోభన్ తో నటించిన ప్రేమ్ కుమార్ గత ఏడాది విడుదలైయింది. ఆహ లో పాపం పసివాడు చేశాను. ఇప్పుడు శివ కందుకూరి గారితో భూతద్ధం భాస్కర్ నారాయణ లో నటించాను. మేము మొదట్లో ముంబైలో వుండేవాళ్ళం. ఇప్పుడు హైదరాబాడ్ కి షిఫ్ట్ అయిపోయాం. టాలీవుడ్ ఇండస్ట్రీ, హైదరాబాద్ నాకు చాలా నచ్చింది. తెలుగులో మాట్లాడటం కూడా నేర్చుకున్నాను.
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
భూతద్ధం భాస్కర్ నారాయణ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
ఈ సినిమా హీరోయిన్ కోసం చాలా కాలంగా అన్వేషిస్తున్నారు. తెలుగు రావడంతో పాటు ఓ కొత్త అమ్మాయి కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటి సమయంలో అనుకోకుండా ఈ సినిమా ఆడిషన్ కి వెళ్ళా. డైరెక్టర్ అనుకున్న పాత్రలో నన్ను పర్ఫెక్ట్ ఛాయిస్ అనుకున్నారు.
ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
ఇందులో నా పాత్ర పేరు లక్ష్మీ, చాలా నేచురల్ గా వుంటుంది. ఈ కథ విన్నప్పుడు షాకింగా అనిపించింది. చాలా బలమైన పాత్ర నాది. ఇందులో సస్పెన్స్ థ్రిల్ రోమాన్స్ పాటలు అన్నీ వున్నాయి. ఇందులో రిపోర్టర్ గా కనిపిస్తాను. తర్వాత ఏం జరుగుతుందనే సస్పన్స్ ఇందులో ఆద్యంతం వుంటుంది. క్లైమాక్స్ ని చివరి వరకూ ఎవరూ గెస్ చేయలేరు. శ్రీచరణ్ పాకాల ఇచ్చిన మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించింది. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ చేసినందుకు చాలా గర్వంగా వుంది.
హీరో శివ కందుకూరి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
శివ చాలా గొప్ప వ్యక్తిత్వం వున్న హీరో. చాలా వినయంగా, ఓపికగా వుంటారు. వాళ్ళ నాన్న పరిశ్రమలో ప్రముఖ నిర్మాత. అయినప్పటికీ ఏ రోజు ఆయనలో ఆ యాటిట్యూడ్ కనిపించదు. అందరినీ సమానంగా చూస్తారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ సినిమా మాకు మంచి విజయాన్ని ఇస్తుందనే నమ్మకం వుంది.
దర్శకుడు పురుషోత్తం రాజ్ గురించి ?
పురుషోత్తం రాజ్ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఆయన విజన్ చాలా క్లియర్ గా వుంటుంది. సినిమాని చాలా అద్భుతంగా తీశారు. నా పాత్ర చేయడానికి చాలా స్పేష్ అండ్ ఫ్రీడమ్ ఇచ్చారు.
నిర్మాతల గురించి ?
చాలా యంగ్ ప్రొడ్యూసర్స్. సినిమా అంటే పాషన్ వుంది. చాలా సపోర్ట్ ఇచ్చారు. రాజీపడకుండా ఖర్చు చేసి గ్రాండ్ గా నిర్మించారు.
ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు ?
వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంటుంది. ఇప్పటివరకు నేను చేసిన పాత్ర భిన్నమైనదే. రాబోయే ప్రసన్న వదనం సినిమాలో కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించాలని వుంది. మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ చేయాలని కూడా వుంది. కథ నచ్చితే గ్లామరస్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమే.
టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరో ?
అల్లు అర్జున్ . ఆర్య 2 చూసి ఆయన ఫ్యాన్ అయిపోయాను. ఆయన ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించడం సర్ ప్రైజ్ గా అనిపిస్తుంటుంది.
కొత్తగా రాబోతున్న చిత్రాలు ?
సుహాస్ గారితో చేసిన ప్రసన్న వదనం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది.
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!