Ranga Ranga Vaibhavamga Trailer: ‘ఉప్పెన’ హీరో లెక్క వేరే ఉందంట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranga Ranga Vaibhavamga Trailer: ఉప్పెన చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం రంగరంగ వైభవంగా. గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఉంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. బావమరదళ్ల మధ్య జరిగిన ఒక క్యూట్ లవ్ స్టోరీగా కనిపిస్తోంది. చిన్నతనంలో ఒక విషయమై గొడవపడి విడిపోయిన హీరో హీరోయిన్లు.. అదే ఈగోతో పెరిగిపెద్దవారవుతారు. ఇక వారిమధ్య ఉండే గొడవలను వినోదాత్మకంగా చూపించినట్లు తెలుస్తోంది.
ఇక ఒకానొక దశలో ఈ బావామరదళ్ల మధ్య ప్రేమ మొదలవుతోంది. అప్పుడే వీరి మధ్య దూరం పెరుగుతోంది. ఆ గొడవలను హీరో ఎలా సాల్వ్ చేశాడు. అసలు మరదలితో, బావకు ఉన్న గొడవ ఏంటి..? చివరికి ఈ జంట ఈగోలను వదిలి కలిశారా..? అనేది సినిమా కథగా తెలుస్తోంది. ఇందులో వైష్ణవ్, కేతిక డాక్టర్స్ గా కనిపించారు. ముఖ్యంగా వీరి మధ్య రొమాన్స్ చాలా ఫ్రెష్ గా కనిపించింది. ఇక వైష్ణవ్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఇక ట్రైలర్ ట్రైలర్ చివర్లో `నాన్నా ఇప్పటి వరకు ఒకలెక్క..ఇప్పటి నుంచి ఇంకో లెక్క” అంటూ వైష్ణవ్ చెప్పిన డైలాగ్ తన కెరీర్ కు అన్వయించుకోవచ్చు. ఉప్పెన తరువాత అలాంటి లవ్ స్టోరీనే ఎంచుకొని విజయాన్ని అందుకోవాలని చూస్తున్నట్లు కనిపించాడు. ఇక సినిమా పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఉప్పెన హిట్ ను తిరగరాస్తాడో లేదో చూడాలి.
Also Read
- Shakeela: ఫోన్ అతిగా చూసే రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్నా.. షకీలా షాకింగ్ హెచ్చరిక!
- I Am Game Release Date: ఆగస్టు 20 కాదు… దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్
- Shweta Singh: సుశాంత్‌ను ఇప్పటికీ కలల్లో చూస్తున్నా.. ధోనీ కనీసం పరామర్శించలేదు.. సోదరి శ్వేత భావోద్వేగ వ్యాఖ్యలు
- Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
తాజావార్తలు
-
Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
-
Pocharam Srinivas Reddy: “అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా”.. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
-
Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
-
Aus vs Ban: బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు కంగారుపడ్డ ఆసీస్ బ్యాటర్స్.!
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!