Ramayana: చైనాలో కొత్త టైటిల్‌తో రణబీర్ ‘రామాయణం’.. పదేళ్ళ ‘దంగల్’ రికార్డుకు చెక్ పడుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్, ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, పాన్ ఇండియా తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు మరో కీలక అడుగు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ చైనాలో కూడా విడుదల కానుందని తెలుస్తోంది. అంతేకాదు, అక్కడి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమా టైటిల్‌ను మార్చనున్నారనే ప్రచారం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
చైనా మార్కెట్ సినీ పరిశ్రమకు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఒక్క సినిమా విజయం సాధిస్తే వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది. అందుకే ఇండియన్ సినిమాలు కూడా అప్పుడప్పుడు చైనా మార్కెట్‌పై దృష్టి పెడుతున్నాయి. అయితే ఈసారి ‘రామాయణం’ విషయంలో మేకర్స్ మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు సమాచారం. చైనాలో ఈ సినిమాను ‘Ramayan: The Legend of Prince Charming’ అనే టైటిల్‌తో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం ఇప్పటివరకు ఆఫీషియల్ అనౌన్స్ చేయలేదు. ఇప్పటికే విదేశీ మార్కెట్ లో రిలీజ్ చేసిన ఇంగ్లీష్ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఎగిరే ఏనుగుల విజువల్స్, యశ్ రావణుడి లుక్ కి ఇంటర్నేషనల్ గా ఆసక్తి పెరుగుతోంది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఇక ‘రామాయణం’ చైనా మార్కెట్లో విజయం సాధిస్తే మరో ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. అదే ‘దంగల్’ రికార్డు. దాదాపు పదేళ్ల క్రితం ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ చైనాలో సంచలన విజయం సాధించింది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం అక్కడ సుమారు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా కొత్త చరిత్ర రాసింది. కుస్తీ నేపథ్యం, కుటుంబ భావోద్వేగాలు చైనా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే దర్శకుడు ప్రపంచ ప్రఖ్యాత ఇతిహాసమైన రామాయణాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. మరి ఈ సినిమా చైనాలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అనే ఆసక్తి కూడా కనిపిస్తోంది ప్రేక్షకుల్లో.
‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 6న విడుదల కానుండగా, భారతదేశంలో దీపావళి సందర్భంగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోనీ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ బాధ్యతలు చేపట్టడం ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ వస్తోంది. చైనాలో టైటిల్ మార్పు గురించి ఇంకా ఆఫీషియల్ అనౌన్స్ రాకపోయినా, రామాయణం అక్కడ విడుదలైతే ‘దంగల్’ పదేళ్లుగా నిలిచిన రికార్డును ఈ సినిమా తిరగరాస్తుందా అన్న ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో మరింత పెరిగింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!