బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ తన కెరీర్, కుటుంబం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ప్రముఖ కపూర్ కుటుంబానికి వారసుడైనా, తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డానో గుర్తుచేశారు. “నా కుటుంబం పేరుతో ఇండస్ట్రీలోకి రావడం సులభం అయింది కానీ, ఆ పేరును నిలబెట్టుకోవడం మాత్రం కష్టమే. నా విజయాల వెనుక నిరంతర శ్రమ, పట్టుదల ఉంది. నేను పెద్ద కుటుంబం నుంచి వచ్చినా, నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎప్పటినుంచో అనుకున్నాను. ఎందుకంటే మన ఫ్యామిలీ విజయాల వెనుక ఎన్నో వైఫల్యాలు దాగి ఉన్నాయి. వాటినుంచి నేర్చుకున్న పాఠాలే నాకు దారి చూపాయి” అని రణ్‌బీర్ అన్నారు.
Also Read : Rajasab : ప్రభాస్ ‘రాజసాబ్’ నుంచి సాంగ్ వీడియో లీక్.. మాస్ లుక్‌లో ప్రభాస్
రిషి కపూర్ కుమారుడిగా, లెజెండరీ నటుడు రాజ్‌కపూర్ మనవడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన రణ్‌బీర్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రయాణం ప్రారంభించారు. 2007లో హీరోగా పరిచయమైన ఆయన, అప్పటి నుంచి వరుస హిట్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్, నితీష్ తివారీ రూపొందిస్తున్న రామాయణంలో రాముడి గా నటించడానికి సిద్ధమవుతున్నారు.