విజయ్ దేవరకొండని రౌడీ హీరోగా మార్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా టాలీవుడ్ లో మోడరన్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. లవ్ స్టొరీ సినిమాల్లో ఒక కల్ట్ స్టేటస్ అందుకున్న ఈ మూవీని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన విధానం అందరికీ నచ్చింది. అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో ‘కబీర్’ టైటిల్ తో రీమేక్ చేశాడు సందీప్. హిందీలో కూడా సూపర్ హిట్ అయిన కబీర్ మూవీపై కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడుతూ… ‘సినిమాలో వయోలెన్స్ ఎక్కువగా ఉందంటూ’ కామెంట్స్ చేశారు. ఈ మాటలు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ వరకూ వెళ్లడంతో, ‘అసలు వయోలెన్స్ అంటే ఎలా ఉంటుందో తన నెక్స్ట్ సినిమాలో చూపిస్తానంటూ ఓపెన్ స్టేట్మెంట్’ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అన్నట్లు గానే సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్ తో ‘అనిమల్’ అనే సినిమాని అనౌన్స్ చేశాడు. పేరులో ‘అనిమల్’ ఉండడంతో, సందీప్ రెడ్డి తన సినిమాపై వచ్చిన విమర్శలని అసలు మర్చిపోయినట్లు లేడని అంతా అనుకున్నారు.
తాజాగా ‘అనిమల్’ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి రణబీర్ కపూర్ ఫోటో ఒకటి లీక్ అయ్యి, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రణబీర్ కపూర్ బియర్డ్ లుక్ లో, చాలా రగ్గడ్ గా కనిపిస్తున్నాడు. రక్తం అంటుకున్న చొక్కాలో రణబీర్ కపూర్ ముందెన్నడూ చూడనంత డెడ్లీ లుక్ తో ఉన్నాడు. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ, సందీప్ రెడ్డి రణబీర్ కపూర్ తో అసలు ఎలాంటి సినిమా ప్లాన్ చేశాడు అంటూ అయోమయంలో పడ్డారు. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా రిలీజ్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ‘అనిమల్’ మూవీని 2023 ఆగస్టులో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.