Rana : ‘విరాటపర్వం’లో పాట పాడిన రానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకూ తాను పోషించిన పాత్రలు ఎవరూ చేయలేనివనే భావిస్తున్నానంటున్నారు రానా. రానా నటించిన 1980 బ్యాక్ డ్రాప్ సినిమా ‘విరాటపర్వం’ ఈ నెల 17న విడుదల కానున్న నేపథ్యంలో మీడియాతో ముచ్చటించారు. ఇందులో రానా పాట పాడటం విశేషం. రానా పాడిన పాటను మీడియాకు వినిపించారు. ఇక తాను డాక్టర్ రవిగా, కామ్రేడ్ రవన్న గా నటించానని, సాయిపల్లవి వెన్నెల పాత్ర పోషించిందని చెప్పారు రానా. తన పాత్రను ఎవరితోనైనా ఫిలప్ చేయవచ్చేమో కానీ సాయిపల్లవి పోషించిన వెన్నెల పాత్రకు మాత్రం ప్రత్యామ్నాయం లేదన్నారు. ఇక తన పాత్ర సృష్టించిందే కానీ రియల్ లైఫ్ క్యారక్టర్ కాదని వివరించారు. పాండవులు ‘విరాటపర్వం’లో అజ్ఞాతవాసంలో ఉన్నట్లే ఇందులో కూడా వెన్నెల పాత్రతో పాటు పలు పాత్రలు అజ్ఞాతంలో ఉండి పోరాటం చేస్తాయని అందుకే దర్శకుడు టైటిల్ అలా పెట్టారని చెప్పారు రానా. లైఫ్ లో తొలిసారి పాట పాడటం గురించి వివరిస్తూ నిజానికి ఈ పాటను ముందు వేరే వారితో పాడించి కూడా సినిమాలో పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి నేనే పాడాలని సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి, దర్శకుడు వేణు పట్టుపట్టి పాడించారన్నాడు.
రానానాయుడు: బాబాయ్ వెంకటేశ్ తో కలసి నటించిన రానా నాయుడు వెబ్ సీరీస్ క్రైమ్ ఎలిమెంట్ తో కూడినదని తొలి సీజన్ షూటింగ్ పూర్తయిందంటూ మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయని తెలిపాడు రానా. అలాగే తన తమ్ముడు అభిరామ్ నటిస్తున్న ‘అహింస’ సినిమా వారం, పదిరోజులు మినహా పూర్తయిందని చెప్పాడు. సోలో హీరోగా నటించాలంటే తన హైట్ అటు హీరోయిన్స్ నుంచి విలన్స్ తోటి ఆర్టిస్ట్ లకు ఇబ్బందిగా ఉంటుందని అందుకే ప్రత్యేకమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నానన్నాడు.
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
2023 మార్చి నుంచి ‘హిరణ్యకశ్యప’: ఇక ఇప్పటికే ప్రకటించిన ‘హిరణ్యకశ్యప’ ఆగిపోలేదని త్వరలో ప్రారంభిస్తామని చెబుతూ తనకు సరైన పాత్ర అదని, 2023 మార్చినుంచి సెట్స్ పైకి వెళుతుందన్నాడు. ఇక పవన్ తో కలసి నటివంచిన ‘భీమ్లానాయక్’లో పాత్ర కూడా తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిందంటున్నాడు రానా. అలాగే ఇటీవల కాలంలో తను చూసిన సినిమాల్లో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ తనకెంతగానో నచ్చిందని చెప్పాడు.
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!