దగ్గుబాటి రానా నటించిన పేట్రియాటిక్ మూవీ ‘1945’ ఈ నెల 31వ తేదీ విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సి. కళ్యాణ్ తెలియచేశారు. నిజానికి 2016లోనే ‘1945’ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీని సత్యశివ తెరకెక్కించారు. అనివార్య కారణంగా విడుదలలో జాప్యం జరిగిన ‘1945’ మూవీ ఎట్టకేలకు ఇప్పుడు వెలుగు చూడబోతోంది.
Read Also : రౌద్రం… రణం…రుధిరం… రియల్ మ్యాజిక్ ఆఫ్ రాజమౌళి!
ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీషర్స్ కు వ్యతిరేకంగా పోరాడిన ఎన్.ఐ.ఎ. (నేషనల్ ఇండియన్ ఆర్మీ) సోల్జర్ గా, సుభాష్ చంద్రబోస్ అనుయాయిగా రానా ఇందులో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనంత శ్రీరామ్ పాటలు రాయగా, ఆకుల శివ సంభాషణలు అందించాడు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పిరియాడిక్ మూవీ ‘1945’ ట్రైలర్ ను త్వరలో విడుదల చేయబోతున్నట్టు సి. కళ్యాణ్ తెలిపారు.