Rana: ‘భీమ్లా నాయక్’ చేయడానికి కారణం అదే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ చిత్రం తెలుగు రీమేక్ హక్కులు సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు తీసుకున్నారని తెలియగానే, దానిని చూసిన వ్యక్తిగా కోషి పాత్ర తాను చేస్తానని నాగవంశీతో మొదటే చెప్పానని రానా అన్నాడు. ఆ సినిమా తాను చేయాలనుకోవడానికి ఓ స్పెషల్ రీజన్ ఉందని బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన వాటినే తాను చేయాలనుకుంటానని, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కూడా ఓ చిన్న ఇగో క్లాష్ మీద బేస్ చేసి తీసిన సినిమా కావడంతో తన జానర్ మూవీ అనిపించిందని, అందుకే ఈ మూవీలో నటించినట్లు రానా తెలిపాడు. కథలో కొత్తదనం తప్పితే కమర్షియాలిటీ గురించి తాను పట్టించుకోనని, అయితే ఇలాంటి డిఫరెంట్ జానర్ మూవీలోనూ హీరోయిజాన్ని అద్భుతంగా చొప్పించడం త్రివిక్రమ్ శ్రీనివాస్, సాగర్ చంద్రకే సాధ్యమైందని, పవన్ లాంటి స్టార్ హీరో యాడ్ అయిన తర్వాత మూవీ రూపురేఖలే మారిపోయాయని పేర్కొన్నాడు. మాతృకలోని మెయిన్ పాయింట్ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని వర్క్ చేశారని కితాబిచ్చాడు. కొన్ని సన్నివేశాలు మాతృకకు దగ్గరగా ఉండటంతో వాటిని తీసేసి, రీ-షూట్ చేసిన సందర్భాలూ ఉన్నాయన్నాడు.
అనారోగ్యంతో దాదాపు రెండేళ్ళు నటనకు దూరంగా ఉన్న తర్వాత హెల్త్ సెట్ అయిన తర్వాత చేసిన సినిమా ఇదని, రిలీజ్ టైమ్‌లో షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉండటంతో అక్కడే తెలుగు ప్రేక్షకుల మధ్య ‘భీమ్లా నాయక్’ను చూశానని, వారి స్పందన చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పాడు. దర్శకుడు సాగర్ చంద్ర గురించి మాట్లాడుతూ.. ‘అతన్ని చూస్తే ఒక్కోసారి ఈర్ష్య కలిగేది. పవన్ కళ్యాణ్, రానా వంటి నటులను ఒకే సినిమాలో డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కడం అంటే మాటలు కాదు. అలానే పక్కనే త్రివిక్రమ్ వంటి దర్శకుడు దన్నుగా నిలవడం, సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి నిర్మాణ సంస్థ లభించడం గొప్ప విషయాలు. అతను కూడా డిఫరెంట్ జానర్స్ ను ఇష్టపడే వ్యక్తి. అందుకే ఎక్కడ కథ పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అతని నుండి వైవిధ్యమైన చిత్రాలు మరిన్ని వస్తాయని ఆశించొచ్చు’ అని అన్నారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
సంయుక్త మీనన్ తో నటించిన సన్నివేశాలు బాగా రావడానికి తాను ఇప్పుడు ఓ ఇంటివాడిని కావడం కారణం కావచ్చని, ఆ అనుభవాలూ తెలియకుండానే నటన మీద ప్రభావం చూపి ఉంటాయని రానా సరదాగా చెప్పాడు. బాబాయ్ వెంకటేష్‌తో కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తున్న ‘రానా నాయుడు’ వెబ్ సీరిస్ షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయ్యిందని, దాని తర్వాతే కొత్త సినిమాకు కమిట్ అవుతానని రానా వెల్లడించాడు. గత కొంతకాలంగా తమన్ సంగీతం మరో లెవెల్‌లో ఉంటోందని, టాలీవుడ్‌కు తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం వరం లాంటిదని, ‘భీమ్లానాయక్’ సంగీతాన్ని తమన్ అదే తరహాలో ఇచ్చాడన్నాడు. సితార ఎంటర్ టైన్‌మెంట్స్‌తో తను అనుబంధం ఇక మీదట కూడా కొనసాగుతుందని, ఆ బ్యానర్‌లో సినిమా చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని చెప్పాడు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు