చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. జాగ్రత్త : పవన్ హెచ్చరిక

టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై పవన్ గట్టిగానే మండిపడ్డారు. గత రాత్రి జరిగిన “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. “18 శతాబ్దంలో ఫ్రాన్స్ లో వ్యాపారవేత్తలంతా కలిసి ఒక ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్ తో కూర్చుని వ్యాపారం గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారట. అప్పుడు ట్రేడ్ మినిస్టర్ ప్రభుత్వం తరపున నేను మీకేం చేయగలను చెప్పండి ? అని అన్నాడట. ఆయన అలా గట్టిగా మాట్లాడం చూసిన వ్యాపారవేత్తలు నువ్వేం చేయక్కర్లేదు. మూసుకుని కూర్చో. ప్రభుత్వం ఏమీ చేయకపోతే మా పనులు మేము చేసుకుంటాము. అసలు ప్రభుత్వం కల్పించుకోవద్దు అన్నారట.

Read Also : చిరంజీవికి చెప్పండి… రిక్వెస్ట్ కాదు హక్కు… : పవన్

ఈ రోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ప్రైవేట్ పెట్టుబడితో సినిమాలు చేస్తే ఈరోజు గవర్నమెంట్ కంట్రోల్ చేస్తా అంటుందేంటి ? మీరు లాజిక్ ఆలోచించండి. అలాంటప్పుడు వైసీపీ మద్దతుదారులు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు మోహన్ బాబు గారు… ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెట్టిన రూల్ అంటే కష్టం మేము పడాలి, టిక్కెట్లు మీరు అమ్ముకుంటారా ! ఓకే… రేప్పొద్దున మోహన్ బాబు విద్యానికేతన్ ది కూడా ఆన్లైన్ లో కలెక్ట్ చేసుకోండి. చిత్ర పరిశ్రమ చాలా చిన్నది అనుకుంటున్నారేమో కాదు. బడ్జెట్ చిన్నదేమో… కానీ ప్రభావం చాలా పెద్దది. ముఖ్యంగా వైసీపీ నేతలకు చెప్తున్నా చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. జాగ్రత్త…” అంటూ హెచ్చరించారు పవన్ కళ్యాణ్.

-Advertisement-చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. జాగ్రత్త : పవన్ హెచ్చరిక

Related Articles

Latest Articles