Ramya Krishnan: రమ్యకృష్ణ.. ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండడు. అందం, అభినయం కలగలిపిన రూపం ఆమె. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె .. ఇప్పుడు కూడా పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తూ అభిమానులను మెప్పిస్తుంది. ఇక శివగామిగా రమ్యకృష్ణ నటనను జీవితంలో ఏ ప్రేక్షకుడు మర్చిపోడు. అసలు ఆమె లేనిదే ఆ పాత్ర ఉండేది కాదేమో అనేంతగా ప్రాణం పోసింది రమ్యకృష్ణ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె.. నేడు కుమారుడుతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకుంది. ఉదయం విఐపీ విరామ సమయంలో కొడుకు రిత్విక్ వంశీతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అనంతరం వేద పండితులు వారికి స్వామివారి పట్టు వస్త్రాలను, ప్రసాదాలను అందించారు.
Rashmi: రష్మీని రాత్రికి వస్తావా అని అడిగిన ఆటో రాంప్రసాద్.. ?
రమ్యకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒక్కగానొక్క కొడుకు రిత్విక్. ప్రస్తుతం చదువుకుంటున్న అతను చూడడానికి బాగానే ఉన్నాడు. హీరో లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు బయట రిత్విక్ కనిపించడు. దీంతో రమ్యకృష్ణకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. ? అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. త్వరలోనే ఈ కుర్రాడు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తాడేమో.. తండ్రి డైరెక్టర్.. తల్లి స్టార్ నటి. కొడుకు కనుక హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఈ జంట భారీగానే ప్లాన్ చేస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ తల్లీకొడుకుల ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం రమ్యకృష్ణ పలు ప్రాజెక్ట్స్ లతో బిజీగా మారింది. ముందు ముందు కొడుకును హీరోగా పరిచయం చేసే ఆలోచనలో రమ్యకృష్ణ ఉందేమో చూడాలి.