టాలీవుడ్ మాస్ స్టార్ నటి రమ్యకృష్ణ..తాజాగా జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లో అతిథిగా హాజరైంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. ఆమె మాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా జగపతిబాబు “నువ్వు చేసిన వాటిలో ఏ సినిమా మరోసారి చేయాలనుంది?” అని అడిగినప్పుడు, రమ్యకృష్ణ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
Also Read : Vash Level 2: వణికిస్తున్న బ్లాక్ మ్యాజిక్.. ‘వాష్ లెవల్ 2’ ట్రైలర్
ఆమె తన ఐటెం సాంగ్స్ అన్ని మళ్లీ చేయాలనుంది. ముఖ్యంగా ‘బాహుబలి’లో శివగామిగా నటించినప్పుడు నిజంగా రాజమాతలా మారిపోయానని, తన డైలాగ్ “నా మాటే శాసనం” ద్వారా ప్రేక్షకులను అలరించానని గుర్తు చేసుకున్నారు. ఇక రమ్యకృష్ణ ఐటెం సాంగ్స్‌లో ఆమె స్టైల్, డాన్స్ ఎలిమెంట్స్ ఇవన్నీ మళ్లీ రీమేక్ చేసి కొత్తగా చూపించాలని ఆమె కోరిక కొత్తగా అనిపించింది. అలాగే షోలో తన కెరీర్ ప్రయాణాన్ని కూడా పంచుకున్నారు. చిన్న ప్రాజెక్ట్‌ల నుండి పెద్ద హిట్ల వరకు, ఆమె ఎదుర్కొన్న కష్టాలు, ఆ ప్రయత్నాల ఫలితంగా వచ్చిన గుర్తింపు, మరియు ప్రేక్షకుల ప్రేమ గురించి చర్చించారు. “ఈ కెరీర్లో ప్రతి అవకాశం నాకు చాలా ముఖ్యమైంది. ప్రతి సినిమాకు వెనుక ఉన్న బృందం, దర్శకులు, నటులు అందించిన సపోర్ట్ వల్లే నేర్చుకున్నాను” అని ఆమె చెప్పింది. కాగా ఈ తాజాగా ఈ ఎపిసోడ్ జీ5లో శుక్రవారం రాత్రి 8:30 గంటలకు, అలాగే జీ తెలుగులో ఆదివారం రాత్రి 8:30 గంటలకు ప్రసారం కానుంది.