Site icon NTV Telugu

Ramajogaiah Sastry: ఆ కుర్చీ మడతపెట్టి.. సరస్వతీ పుత్రుడికే కోపం తెప్పించావ్ కదరా

Ram Jo

Ram Jo

Ramajogaiah Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించాకా.. సినీయర్ గేయ రచయితల్లో రామజోగయ్య శాస్త్రి బిజీగా మారాడు. స్టార్ హీరో సినిమాలు అయినా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అయినా.. ఆయన సాంగ్ లేనిదే సినిమా పూర్తి అవ్వదు. ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాలన్నింటికీ కనీసంలో కనీసం ఒక్క పాట అయినా రామ్ జో రాసిన పాట ఉంటుంది. ఇక మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మధ్య గుంటూరు కారం సినిమా నుంచి ధమ్ మసాలా బిర్యానీ సాంగ్ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. ఈ సాంగ్ రాసింది రామజోగయ్య శాస్త్రినే. అందులో మహేష్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ.. రాసిన లిరిక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ” నా మనసే నా కీటికీ.. నచ్చకపోతే మూసేస్తా. ఆ రేపటి గాయాన్ని ఇపుడే ఆపేస్తా. నా తలరాతే రంగుల రంగోళి. దిగులైన చేస్తా దీవాళీ. నా నవ్వుల కోటను.. నేనే ఎందుకు.. ఎందుకు పడగొట్టాలి” ఈ లిరిక్స్ అయితే వేరే లెవెల్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Namitha: చీటింగ్ కేసు.. పరారీలో నమిత భర్త

ఇక తాజాగా ఈ పర్టిక్యులర్ లిరిక్స్ ను రామజోగయ్య శాస్త్రి పాడుతూ ఒక వీడియో చేశాడు. అందులో వెనుక సాంగ్ వినిపిస్తుండగా.. దాంతో పాటు రామ్ జో శృతి కలిపాడు. ఇకఈ వీడియోను ఒక నెటిజన్ షేర్ చేస్తూ.. పాటలు రాయండి.. కానీ పాడకండి సర్ అంటూ కామెంట్ పెట్టాడు. ఇక ఈ కామెంట్ కు హార్ట్ అయిన మన సరస్వతీ పుత్రుడు.. కుర్చీ ఎమోజిస్ ను షేర్ చేశాడు. కుర్చీ మడతపెట్టి.. అని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు అన్నమాట. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. సరస్వతీ పుత్రుడికే కోపం తెప్పించావ్ కదరా అంటూ అభిమానులు సైతం కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version