“క్రాక్”తో మాస్ మహారాజ రవితేజ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ సినిమా సక్సెస్‌తో రవితేజ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లకు సంతకం చేశాడు. ఆ ప్రాజెక్టులలో “రామారావు ఆన్ డ్యూటీ” ఒకటి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రేపు ఉదయం 10:08 గంటలకు రవితేజ అభిమానుల కోసం ఆసక్తికరమైన అప్‌డేట్ రాబోతోందని తాజాగా టీమ్ ప్రకటించింది. మాసివ్ అనౌన్స్మెంట్ అంటూ మేకర్స్ ఊరించగా, అభిమానులు సినిమా నుంచి టీజర్ అప్‌డేట్, ఫస్ట్ సింగిల్ లేదా సినిమా విడుదల తేదీపై అప్‌డేట్ వచ్చే అవకాశం ఉండొచ్చని అంచనా వేయడం ప్రారంభించారు. మరి రేపు “రామారావు” ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయబోతున్నాడో చూడాలి.
Read Also : ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య… వీడియో వైరల్
ఈ చిత్రంలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. మలయాళ నటి రజిషా విజయన్ కూడా ఈ యాక్షన్ డ్రామాలో భాగం కానుంది. రాజిషాకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రవితేజ సొంత నిర్మాణ సంస్థ ఆర్టీ టీమ్ వర్క్స్ తెరకెక్కిస్తోంది. రవితేజకు నిర్మాతగా ఇదే తొలి వెంచర్ కావడం విశేషం.