Ram Pothineni: టాలీవుడ్ కుర్ర హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. ఎనర్జిటిక్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ గతేడాది ది వారియర్ సినిమాతో పరాజయాన్ని చవిచూసిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా తరువాత రామ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ ను ప్లాన్ చేశాడు. ప్రస్తుతంశరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీ లీల నటిస్తోంది. గతేడాది రామ్ పెళ్లి న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం విదితమే. రామ్ కు కాబోయే భార్య అని.. రామ్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని,రామ్ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడని డిఫరెంట్ డిఫరెంట్ థంబ్ నెయిల్స్ తో వార్తలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. రామ్ తన చిన్ననాటి స్నేహితురాలును వివాహమాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ వార్తలపై అప్పట్లో రామ్ స్పందించిన తీరు అభిమానులకు నవ్వులు పూయించినది. ఆ అమ్మాయి ఎవరో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను అని, మా ఇంట్లో వాళ్ళు ఈ వార్తలను విని నిజంగానే నేను పెళ్లి చేసుకోబోతున్నాని అనుకుంటున్నారు. అలాంటి అమ్మాయి ఎవరు లేరు అని చెప్పమని అడిగేశాడు. దీంతో రామ్ పెళ్లి పుకార్లకు చెక్ పడింది.
ఇక తాజాగా రామ్ ట్విట్టర్ వేదికగా రామ్ ఒక ఫోటోను షేర్ చేశాడు. అందులో ఒక చిన్న పిల్లాడితో చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. దాని కింద క్యాప్షన్ గా ” ఎందుకంటే ఈరోజు సన్ (son) డే.. సిద్దాంత్ పోతినేని” అని పెట్టుకొచ్చాడు. ఈ ఫోటో షేర్ చేసి రామ్ మరోసారి లేనిపోని అనుమానాలకు తావు ఇచ్చేశాడు. ఏంటి రామ్ కు పెళ్లి అయ్యి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..?. రామ్ కు పెళ్లి ఎప్పుడు అయ్యింది..? అని కొందరు.. సీక్రెట్ గా రామ్ పెళ్లి చేసుకున్నాడా..? అని మరికొందరు తమకిష్టమైన పద్దతిలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే అతడు రామ్ కొడుకు కాదు.. రామ్ కు పెళ్లి కాలేదు. సిద్దాంత్ రామ్ అన్న కొడుకు.. బాబాయ్ తో బుడ్డోడు ఆటలు ఆడుతూ ఎన్నోసార్లు కనిపించాడు. సమయం దొరికినప్పుడల్లా రామ్, కొడుకుతో ఇలా ఆడుతూ కనిపిస్తాడు. ఇక రామ్ పెళ్లి విషయానికొస్తే ఈ ఏడాదిలో శుభవార్త చెప్తాడని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజమో తెలియాల్సి ఉంది.