సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా రిలీజ్ కి వారం ముందు వరకూ అసలు ఎలాంటి బజ్ లేదు. రజినీ సినిమాని ప్రమోట్ చెయ్యట్లేదు ఏంటి అని ప్రతి ఒక్కరూ అయోమయంలో పడ్డారు. ఓపెనింగ్స్ కూడా కష్టమే అనుకుంటున్న సమయంలో జైలర్ సినిమా ప్రమోషన్స్ కి ప్రాణం పోసి, ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ కి కారణం అయ్యింది ‘హుకుమ్’ సాంగ్. అనిరుద్ ఎలక్ట్రిఫయ్యింగ్ ట్యూన్ కి, సూపర్బ్ సుబు రాసిన లిరిక్స్ ఒక్కసారిగా రజినీకాంత్ మేనియాని వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యేలా చేసింది. ఈ సాంగ్ మధ్యలో ‘నీ నాన్న విజిల్ విన్నవాడు, నీ కొడుకు మనవడితో కూడా డాన్స్ చేయించగలడు ఇతను…’ అనే లిరిక్ ఉంటుంది. నాలుగున్నర దశాదబ్దాలుగా రజినీ ఆడియన్స్ ని ఎలా ఎంటర్టైన్ చేసాడో సుబు ఈ ఒక్క లిరిక్ తో చెప్పేసాడు. అందుకే ఫ్యాన్స్ ఎక్కువగా హుకుమ్ సాంగ్ కి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇదే హుకుమ్ సాంగ్ తో బాలయ్యకి ఎలివేషన్ ఇచ్చాడు రామ్ పోతినేని.
బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ పోతినేని హీరోగా రిలీజ్ అవనున్న సినిమా స్కంద. వినాయకచవితి కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి నటసింహం నందమూరి బాలకృష్ణ గెస్టుగా వచ్చాడు. దీంతో స్కంద ఈవెంట్ మరింత జోష్ ఫుల్ గా మారింది. ఈ ఈవెంట్ లో రామ్ పోతినేని బాలయ్య గురించి మాట్లాడుతూ హుకుమ్ సాంగ్ లిరిక్స్ ని వాడాడు. హుకుమ్ సాంగ్ లిరిక్స్ ని తమిళ్ లో చెప్పి, వాటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన రామ్ పోతినేని… మూడు తారలు జై బాలయ్య అని అరుస్తున్నాయి అంటే మాములు అఛీవ్మెంట్ కాదు సర్ అంటూ చెప్పాడు. ఊహించని ఈ ఎలివేషన్ కి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు, దీంతో సోషల్ మీడియా అంతా బాలయ్య ట్రెండ్ అవుతున్నాడు. జైలర్ సినిమాలో కూడా బాలయ్యని కాస్ట్ చేయాలి అనుకున్నాను అని డైరెక్టర్ నెల్సన్ చెప్పాడు, అదే జరిగి ఉంటే జై బాలయ్య స్లోగన్ సౌత్ ఇండియా మొత్తం మరింత గట్టిగా వినిపించేదేమో.