నేను చావాలని కోరుకొనేవారందరికి సంక్రాంతి శుభాకాంక్షలు- ఆర్జీవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా పండగకు ప్రతి ఒక్కరు అందరు బాగుండాలని కోరుకుంటారు. తమ జీవితంలో మంచి రోజులు రావాలని, ఐశ్వర్యారోగ్యాలు ఉండాలని, తమతో పాటు అందరు కూడా బావుండాలని కోరుకుంటారు. మంచి తెలుస్తూనే శుభాకాంక్షలు తెలుపుతారు. అయితే అందరిలా చెప్తే తనకు వాల్యూ ఏముంటది అనుకున్నాడో.. లేక నా తీరే ఇంత అని మరోసారి నిరూపిద్దామనుకున్నాడో.. వివాదాల దర్శకుడు వెరైటీగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. ” అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భగవంతుడు మీలో ప్రతి ఒక్కరికి పెద్ద ఇల్లు మరియు ముకేష్ అంబానీ కంటే ఎక్కువ డబ్బుని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ మీకు ఎలాంటి వైరస్ సోకకుండా ఉండాలి. మగవాళ్లందరికి ప్రపంచంలోనే అత్యంత అందమైన స్త్రీని పొందాలని, అందరు స్త్రీలు అత్యంత అందమైన వ్యక్తిని పొందాలని కోరుకుంటున్నాను” అని పాజిటివ్ గా స్టార్ట్ చేసిన వర్మ వరుస ట్వీట్లతో పిచ్చెక్కించాడు.
భర్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ” మీ భార్యలు మీరు ఏం చేసినా.. చేయకపోయినా మిమ్మల్ని బాధించకుండా ఉండాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇక సినీ నిర్మాతలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ” సినిమా నిర్మాతలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. మీరు ఏ టికెట్ ధరను కోరుకున్నారో, అలాగే ఫ్లాప్‌లలో మీరు పోగొట్టుకున్న డబ్బును కూడా చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ఆమోదించేలా దేవుడు చేస్తాడని కోరుకుంటున్నాను అని తెలిపాడు. ఆ తరువాత “చిన్న సినిమా నిర్మాతలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మీ ప్రతి చిన్న సినిమా బాహుబలి కంటే చాలా పెద్ద హిట్ అవ్వాలి” అని కోరుకున్నాడు. ఇక చివరగా తన శత్రువులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. “నన్ను ద్వేషించే వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. నేను త్వరగా చనిపోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరి కోరికను దేవుడు అతి త్వరలోనే తీర్చాలని కోరుకొంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా వర్మ శుభాకాంక్షలు తెలపడం కొత్త అనుకుంటే ఇలా ప్రతి ఒక్కరికి తమదైన రీతిలో విషెస్ తెలపడం మాత్రం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
Happy Sankranthri to all and may god bless each and everyone of u with a bigger house and more money than Mukesh Ambani and may no virus present or future infect u and may all men get the most beautiful woman in world and all women get most handsome man🙏💐
— Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022
Happy Sankranthri to all husbands and may god grant ur wish that ur wives will never nag u and they will be okay with whatever u do or u don’t do 🙏💐
— Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022
Happy Sankranthri to all film makers and may god make AP govt agree to whatever ticket price u guys want and also pay u whatever money u might lose in ur flops 💐🙏💪
— Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022
Happy Sankranthri to all small film makers and may each and every one of ur small films become a much bigger hit than Bahubali 🙏💐💪
— Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022
Happy Sankranthri to all my haters and may god grant ur wish that I will die asap 😎😎😎💐💐💐
— Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!