RRRలో తన అద్భుతమైన నటనతో అభిమానులను అలరించిన చరణ్ నెక్స్ట్ మూవీ గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. “ఆచార్య”లో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇందులో పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఆచార్య’లో సోనూ సూద్, జిషు సేన్‌గుప్తా, వెన్నెల కిషోర్, సౌరవ్ లోకేష్, కిషోర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, అజయ్, సంగీత క్రిష్, బెనర్జీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజా ఇంటర్వ్యూలో నిర్మాత అన్వేష్ రెడ్డి ఈ సినిమాలో చిరు, చరణ్ స్క్రీన్ టైం రివీల్ చేసేశారు.
Read Also : Attack Challenge : బాలీవుడ్ హీరోకు అదిరిపోయే వీడియోతో సామ్ రిప్లై
“ఆచార్య”లో వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానులకు ట్రీట్ అవుతుందని వెల్లడించిన అన్వేష్ రెడ్డి “ఇంతకుముందు వారిద్దరూ స్క్రీన్ పై కలిసి కన్పించారు. కానీ చిన్న అతిధి పాత్ర లేదా ఒక పాటలో కన్పించారు. కానీ ఈసారి వారు దాదాపు 20 నుండి 25 నిమిషాల సినిమా స్క్రీన్ స్పేస్‌ను ఆచార్యలో పంచుకోనున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికీ ఇది ఉత్సాహకరంగా ఉంటుంది. ఈ సినిమాలో వీరిద్దరూ చాలాసేపు స్క్రీన్ టైం షేర్ చేసుకున్నారు. దాదాపు 20 నుండి 25 నిమిషాల పాటు ఇద్దరూ స్క్రీన్ పై కన్పిస్తారు” అని అన్వేష్ రెడ్డి చెప్పుకొచ్చారు.