Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అన్న విషయం అందరికి తెల్సిందే. ఫుల్ బిజీ షెడ్యూల్స్ ఉన్నా కూడా భార్య ఉపాసన కోసం కొన్నిరోజులు గ్యాప్ తీసుకొని అయినా ఆమెతో గడుపుతూ ఉంటాడు. టాలీవుడ్ లో మోస్ట్ అడోరబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన జంట టాప్ 10 లిస్ట్ లో ఉంటారు. మెగా కోడలిగా అడుగుపెట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఉపాసన అత్తగారింటికి, భర్తకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది. ఇక చరణ్ సైతం ఉపాసనను అంతే అమితంగా ప్రేమిస్తూ ఉంటాడు. ఆమెతోనే ఎక్కువ టైమ్ గడపడానికి ఎదురుచూస్తూ ఉంటాడు. ఇలాంటి అనోన్య దాంపత్యం చాలా అరుదుగా ఉంటుంది అంటూ ఉంటారు మెగా అభిమానులు.
ఇక తాజాగా నేడు ఉపాసన పుట్టినరోజు కావడంతో చరణ్ ఎంతో స్పెషల్ గా శుభాకాంక్షలు తెలిపాడు. తన తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖతో పాటు తాను, తన భార్య ఉన్న ఫోటోను షేర్ చేస్తూ “నా ప్రియమైన ఉపాసనా.. పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ చెప్పుకొచ్చాడు. ఆ ఫోటోలో కొడుకు, కోడలితో చిరు, సురేఖ చిరునవ్వును చిందిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం చరణ్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ సినిమాతో చరణ్ మరో పాన్ ఇండియా హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.
Ram charan latest Instagram Post: