కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక విషాద మరణంతో దిగ్భ్రాంతికి లోనైన లక్షలాది మంది అభిమానులు, సినీ వర్గాలు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. అక్టోబర్ 29న మరణించిన పునీత్ కు తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచి సన్నిహితులైన బాలయ్య, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, రానా వంటి ప్రముఖులు కడసారిగా కన్నీటి నివాళులు అర్పించారు. తాజాగా రామ్ చరణ్ పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని పరామర్శించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన చరణ్.. పునీత్ కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు, ఆయన ఫోటోకు నివాళులర్పించారు. మెగా ఫ్యామిలీకి రాజ్‌కుమార్ ఫ్యామిలీతో సాన్నిహిత్యం ఉంది. ముఖ్యంగా పునీత్ రామ్ చరణ్‌కి మంచి స్నేహితుడు. నివాళులు అర్పించిన అనంతరం రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ “పునీత్ మా సొంత ఫ్యామిలీ మెంబర్… ఆయనకు ఇలా జరిగిందన్న విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. మాటలు రావట్లేదు. పునీత్ చాలా నిజాయితీ గల వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియియజేస్తున్నాను. అభిమానులు నిరాశ పడొద్దు, ధైర్యంగా ఉండాలి” అని అన్నారు. ఇంకా నిన్న నాగార్జున సైతం పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన విషయం తెలిసిందే.
Read Also : వివాదంలో “జై భీమ్”… ప్రకాష్ రాజ్ సీన్ పై విమర్శలు