Ram Charan: రామ్ చరణ్‌కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఆందోళన కలిగించే వార్త బయటకు వచ్చింది. ఇటీవల బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన రామ్ చరణ్, ఇప్పుడు శస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్టుల షెడ్యూల్‌పై కూడా చర్చ మొదలైంది. సమాచారం ప్రకారం, రామ్ చరణ్ తన తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ, భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరుకు వెళ్లారు. అక్కడ జూలై 27న ఆయనకు మణికట్టుకు శస్త్రచికిత్స జరగనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ అనంతరం కొన్ని వారాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
‘పెద్ది’ చిత్రంలో కుస్తీ నేపథ్యంలో తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ మణికట్టుకు తీవ్ర గాయం అయినట్లు తెలుస్తోంది. వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ, సినిమా పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో దానిని కొంతకాలం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. గాయం ఉన్నప్పటికీ చేతికి చిన్న కట్టు కట్టుకుని సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం చరణ్ కమిట్మెంట్కు నిదర్శనంగా అభిమానులు పేర్కొంటున్నారు. ఈ సర్జరీ కారణంగా రామ్ చరణ్ కొంతకాలం విశ్రాంతి తీసుకోనుండటంతో, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్న RC17 చిత్ర షూటింగ్ కూడా ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్ ఫైనల్ స్క్రిప్ట్ పూర్తి చేసి, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
Also Read
- Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్.. షూటింగ్ పూర్తి, రిలీజ్ కోసం వెయిటింగ్
- Srinivasa Mangapuram: జూలై 30న హిట్ కొడుతున్నాం.. కాన్ఫిడెంట్‌గా 'శ్రీనివాస మంగాపురం' టీమ్.. జయకృష్ణ నటనపై ప్రశంసలు
- Newtons 3rd Law: పోలీస్ ఆఫీసర్‌గా సుమంత్.. 'న్యూటన్స్ థర్డ్ లా' ట్రైలర్లో అదిరిపోయిన ట్విస్టులు
- Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స చేయించుకోగా, నటసింహం బాలకృష్ణ కూడా తన 111వ సినిమా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో మోకాలికి గాయపడి సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా షూటింగ్లో గాయపడటంతో, స్టార్ హీరోలు తమ సినిమాల కోసం ఎంతటి రిస్క్ తీసుకుంటున్నారో మరోసారి స్పష్టమవుతోంది.
- Tags
- cinema
- Ram Charan
తాజావార్తలు
-
Ram Charan: రామ్ చరణ్‌కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!