Ram Charan : హీరోలు కేవలం సినిమాలే కాకుండా చేతినిండా బిజినెస్ లతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే బాటలో వెళ్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో థియేటర్ల బిజినెస్ ను టాప్ లోకి తీసుకెళ్లింది అల్లు అర్జున్. ఏషియన్ సంస్థతో కలిసి ఆయన మల్టీప్లెక్స్ థియేటర్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, రవితేజ లాంటి స్టార్లు కూడా థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే బాటలోకి వస్తున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగతంగా రామ్ చరణ్ కు చాలానే బిజినెస్ లు ఉన్నాయి. ఇప్పుడు థియేటర్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నట్టు తెలుస్తోంది.
Read Also : Abhishek Bachchan : అశ్లీల వెబ్ సైట్లలో అభిషేక్ బచ్చన్ ఫొటోలు.. ఏం చేశాడంటే..?
త్వరలోనే ఆయన లగ్జరీ మల్టీప్లెక్స్ థియేటర్ ను కట్టబోతున్నారంట. అది కూడా హైదరాబాద్ లోనే అని తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్ గతంలోనే నిర్మాతగా మారాడు. అప్పుడు చాలానే సినిమాలు నిర్మించాడు. ఇప్పుడు థియేటర్ బిజినెస్ లో అడుగు పెట్టబోతున్నాడు. చిరంజీవి కూడా ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంట. ఇంకేముంది చరణ్ కు అన్ని రకాలుగా క్లియరెన్స్ ఉండటంతో చర్చలు జరుపుతున్నారంట. ఒక్కడే థియేటర్ ను ఏర్పాటు చేయాలా.. లేదంటే పార్ట్ నర్ షిప్ లో ఏర్పాటు చేయాలా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also : Nayanthara : నయనతార రూ.5 కోట్లు ఇవ్వు.. మరో కాంట్రవర్సీ
