PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవైటేడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 135. 36 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టి ఈ చిత్రం సంచలనం సృష్టించింది. దాదాపు అన్ని ఏరియాలలో సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’.. రాయలసీమ (సీడెడ్) రీజియన్‌లో మాత్రం మిగతా ఏరియాలతో పోలిస్తే కాస్త స్లోగా స్టార్ట్ అయినప్పటికీ, ఓవరాల్‌గా టాప్ రికార్డుల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.
రాయలసీమ ఏరియాలో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘పెద్ది’ రూ. 7.70 కోట్ల షేర్ వసూళ్లతో ఆల్‌టైమ్ టాప్ 4వ స్థానంలో నిలిచింది. రామ్ చరణ్ మాస్ క్రేజ్ కారణంగా సీడెడ్ వ్యాప్తంగా థియేటర్లలో భారీ హంగామా కనిపించింది. ఈ కలెక్షన్లతో చరణ్ మరోసారి రాయలసీమ బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను నిరూపించుకున్నాడు. అయితే రాయలసీమ డే-1 కలెక్షన్ల చార్ట్‌లో ఇప్పటికీ ఎస్.ఎస్. రాజమౌళి విజువల్ వండర్ ‘RRR’ రూ. 17 కోట్లతో మొదటి స్థానంలో అజేయంగా కొనసాగుతోంది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ రూ. 12.15 కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ రూ. 10.40 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ టాప్ 3వ స్థానాన్ని దక్కించుకోగా ఇప్పుడు రామ్ చరణ్ ‘పెద్ది’ రూ. 7.70 కోట్లతో నాల్గవ స్థానాన్ని ఆక్రమించింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా లాంగ్ రన్లో రాయలసీమలో మరిన్ని వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- JanaNayagan : విజయ్ 'జననాయగన్'.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
తాజావార్తలు
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..