NTV Telugu Site icon

Ram Charan: RC16 లీకేజ్ ఇచ్చేసిన రామ్ చరణ్.. రంగస్థలంకి మించి..

Ram Charan About Rc16

Ram Charan About Rc16

Ram Charan Says He Is Doing Path Breaking Role Which Is Better Than Rangasthalam: ఓవైపు సినీ ప్రియులందరూ శంకర్‌తో రామ్ చరణ్ చేస్తున్న ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తుంటే.. రామ్ చరణ్ మాత్రం ఆ తదుపరి సినిమా (RC16) గురించి స్టన్నింగ్స్ కామెంట్స్ చేశాడు. అదొక పాత్‌బ్రేకింగ్ ప్రాజెక్ట్ అవుతుందని, అందులో తాను ‘రంగస్థలం’కి మించిన అద్భుతమైన పాత్ర పోషిస్తున్నానని తెలిపాడు. ఢిల్లీలో నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో తదుపరి చిత్రాల గురించి ప్రశ్నించినప్పుడు.. శంకర్ తర్వాత తాను చేస్తున్న RC16 ప్రాజెక్ట్‌పై చాలా నమ్మకంగా ఉన్నానని అన్నాడు. ‘‘నేను శంకర్ ప్రాజెక్ట్ తర్వాత చేయబోతున్న సినిమాలో ఓ పాత్-బ్రేకింగ్ పాత్రలో నటించబోతున్నాను. ఇది రంగస్థలంకి మించిన ఉత్తమమైన సబ్జెక్ట్. సెప్టెంబర్ నుంచి ఈ సినిమాని ప్రారంభించబోతున్నాను. ఇది వెస్టర్న్ ఆడియెన్స్‌ని సైతం మెప్పించగలుగుతుందని నేను బలంగా నమ్ముతున్నా’’ అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.

Ponniyin Selvan 2: ‘పీఎస్2’కి ఊహించని షాక్.. అక్కడ తప్ప మిగతా భాషల్లో నిల్?

అంతేకాదు.. ఒకవేళ అవకాశం వస్తే తాను విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించడానికి కూడా సిద్ధమేనని రామ్ చరణ్ ప్రకటించాడు. తనకు ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాలనుందని చరణ్ చెప్తుండగా.. పక్కనే ఉన్న ఓ రిపోర్టర్ అందుకొని ‘విరాట్ కోహ్లీ బయోపిక్‌లో ఎందుకు నటించకూడదు?’ అని పేర్కొన్నాడు. ఇద్దరి పోలికలు ఒకేలా ఉంటాయని, కోహ్లీ బయోపిక్ చేస్తే వర్కౌట్ అవుతుందని ఆ రిపోర్టర్ తెలిపాడు. ఆ ఛాన్స్ వస్తే తాను తప్పకుండా బయోపిక్ చేస్తానని, కోహ్లీ కూడా ఎంతోమందికి స్ఫూర్తి అని పేర్కొన్నాడు. ఇదే సమయంలో తన హాలీవుడ్ అరంగేట్రం గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘చరణ్ ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అనే వార్త నిజమేనా?’’ అని ప్రశ్నించగా.. అది నిజమేనన్నాడు. ప్రస్తుతం చర్చలు కూడా కొనసాగుతున్నాయని క్లారిటీ ఇచ్చాడు. ఇది తప్పకుండా పట్టాలెక్కుతుందని కూడా అన్నాడు. కాకపోతే.. ఆ ప్రాజెక్ట్ వివరాలు రివీల్ చేయలేదు.

Actor Shiva Krishna: అది వెబ్ సిరీస్ కాదు, బ్లూ ఫిలిమ్.. సీనియర్ నటుడు ఫైర్

Show comments