Ponniyin Selvan 2: ‘పీఎస్2’కి ఊహించని షాక్.. అక్కడ తప్ప మిగతా భాషల్లో నిల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Buyers For Ponniyin Selvan 2: సాధారణంగా సీక్వెల్ సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడుతాయి. వాటి థియేట్రికల్ హక్కులకు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ప్రేక్షకుల్లోనూ సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అనే క్యూరియాసిటీ ఉంటుంది. కానీ.. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ విషయంలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఏప్రిల్ 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదని సమాచారం. తమిళంలో తప్ప.. మిగతా భాషల్లో ఈ చిత్రానికి సరిగ్గా బిజినెస్ జరగట్లేదని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పీఎస్2 హక్కుల్ని కొనేందుకు ఇంతవరకు ఎవ్వరూ ముందుకు రాలేదట. దీంతో.. మణిరత్నంని రంగంలోకి దింపి, బయ్యర్స్‌ని ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట! అప్పటికీ హక్కులు అమ్ముడుపోకపోతే.. ఓన్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్. అటు.. బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రంపై ఏమాత్రం హైప్ లేదు. ఇందుకు.. పీఎస్1 ఇతర రాష్ట్రాల ఆడియెన్స్‌కు పెద్దగా కనెక్ట్ కాకపోవడమే!
Actor Shiva Krishna: అది వెబ్ సిరీస్ కాదు, బ్లూ ఫిలిమ్.. సీనియర్ నటుడు ఫైర్
Also Read
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
చెప్పుకోవడానికి పొన్నియిన్ సెల్వన్ రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టగలిగింది కానీ, ఇతర రాష్ట్రాల్లో అంతగా ఆదరణ పొందలేకపోయింది. ఇదో హిస్టారికల్ మూవీ అయినప్పటికీ.. తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించిందని, ఈ సినిమా పెద్దగా సినిమాటిక్ అనుభూతి ఇవ్వలేదని కామెంట్లు వినిపించాయి. క్రిటిక్స్ కూడా తొలి భాగానికి ఆశాజనకమైన రివ్యూలు ఇవ్వలేదు. అందుకే.. రిలీజ్ దగ్గరపడుతున్నా, ‘పీఎస్2’కి పెద్దగా క్రేజ్ ఏర్పడటం లేదని తెలుస్తోంది. కాగా.. తమిళ రైటర్ కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా రెండు భాగాల్లో రూపొందింది. ఇందులో కార్తీ, విక్రమ్, జయం రవి, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్య రాయ్, త్రిషా మొదలైన స్టార్ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఒక్క కోలీవుడ్‌లోనే రూ.200 కోట్లు కొల్లగొట్టి, ఈ స్థాయి వసూళ్లు రాబట్టిన తొలి తమిళ చిత్రంగా అక్కడ రికార్డ్ నెలకొల్పింది. ఈ సినిమా రెండో భాగం ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది.
Live-in Relationship: ఇన్‌స్టాలో పరిచయం.. ఆపై సహజీవనం.. చివర్లో పెద్ద ట్విస్ట్
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!