RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తాజా చిత్రం ‘పెద్ది’తో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృటించారు. కేవలం ఐదు రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన ఈ సినిమా లాంగ్ రన్లో మరిన్ని భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ భారీ విజయంతో మెగా అభిమానులు ఫుల్ జోష్‌లో ఉండగా, రామ్‌చరణ్ కూడా ఈ సక్సెస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు.
మరోవైపు రామ్‌చరణ్ తన తదుపరి చిత్రం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ తన కెరీర్లో 17వ సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో ఈసారి దానికి మించిన కథను సుకుమార్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పైగా ‘పుష్ప 2’ వంటి భారీ విజయం తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమాలో రామ్‌చరణ్ లుక్ ఎలా ఉండబోతుందనే దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు అప్పుడే రకరకాల అంచనాలకు వచ్చేస్తున్నారు. ‘పెద్ది’ సినిమాలో చరణ్ పొడవాటి జుట్టుతో రగ్గడ్ లుక్‌లో కనిపించి అలరించారు. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయిన వెంటనే ఆ లుక్ నుండి బయటకు వచ్చేసి కొత్త సినిమా కోసం మేకోవర్ మారుస్తూ ఉంటారు. కానీ రామ్‌చరణ్ మాత్రం ఇప్పటికీ అదే లాంగ్ హెయిర్ లుక్‌ను కంటిన్యూ చేస్తుండటం విశేషం.
Also Read
దీంతో సుకుమార్ సినిమాలో కూడా రామ్‌చరణ్ ఇదే లాంగ్ హెయిర్ లుక్‌లో కనిపిస్తారా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఒకవేళ సుకుమార్ సినిమా కోసమే ఈ లుక్‌ను మార్చకుండా ఉంచి ఉంటే RC17 లో చరణ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. మరి సుకుమార్ రామ్‌చరణ్‌ను ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..