Site icon NTV Telugu

Peddi : చికిరి పాటపై చరణ్‌ ఫ్యాన్స్ అసంతృప్తి.. మిక్స్ డ్ టాక్

Chikri

Chikri

Peddi : మెగా పవర్ రామ్ చరణ్‌ నటిస్తున్న పెద్ది నుంచి చికిరి సాంగ్ వచ్చేసింది. కానీ అనుకున్న రేంజ్ లో సాంగ్ లేదనే కామెంట్లు వస్తున్నాయి. అసలే రామ్ చరణ్‌, బుచ్చిబాబు కాంబో.. పైగా విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి అందరూ రంగస్థలం రేంజ్ సాంగ్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. పైగా బుచ్చిబాబు తీసిన ఉప్పెన సాంగ్స్ ఓ రేంజ్ లో ఊపేశాయి. సాంగ్స్ మీద పట్టున్న బుచ్చిబాబు మెలోడీ కింగ్ రెహమాన్ తో అలాంటి సాంగ్ చేస్తాడని అంతా అనుకుంటే బిస్కెట్ అయిందని చెబుతున్నారు. రెహమాన్ ఇలా చేశాడేంటని కొందరు అంటుంటారు. ఈ సాంగ్ కు రామ్ చరణ్‌ హిట్ సాంగ్స్ కు వచ్చినంత వ్యూస్ రాలేదు. ఆ స్థాయి క్రేజ్ కూడా రావట్లేదు.

Read Also : Chiranjeevi : పవన్ కల్యాణ్ ను ఆ కారణంతోనే అందరూ ఇష్టపడతారు.. చిరు ఎమోషనల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కు ఉన్న ఫాలోయింగ్ లో ఎక్కువ పర్సెంట్ సాంగ్స్ ను దృష్టిలో పెట్టుకుని వచ్చిందే. ఎందుకంటే రామ్ చరణ్‌ సినిమాల్లో సాంగ్స్ బాగుంటాయనే క్రేజ్ ఉంది. అందులోనూ బుచ్చిబాబు సినిమా. ఉప్పెన మూవీ పాటలు ఏ స్థాయిలో ఆకట్టుకున్నాయో మనం చూశాం కదా. పైగా ఈ సారి మెలోడీ కింగ్ ఏఆర్ రెహమాన్ ను రంగంలోకి దించాడు కాబట్టి ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ చికిరి పాటను చూసిన ఫ్యాన్స్ ఒకింత డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే చికిరి పాట అటు మెలోడీ ఫ్యాన్స్ ను గానీ.. ఇటు ఫ్యాన్సీ ప్రేక్షకులను గానీ ఆకట్టుకోవట్లేదు. ఎటూ అర్థం కాకుండా ఉంది. వినసొంపుగా లేదు అని కొందరు అంటుంటే.. ఇంకొందరు మాత్రం ఈ పాట బాగానే ఉంది కదా అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. రాబోయే సాంగ్స్ అయినా బాగుండాలని అంటున్నారు.

Read Also : Chiranjeeva Movie Review: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ రివ్యూ

Exit mobile version