Site icon NTV Telugu

Ram Charan: ఇన్‌స్టాగ్రామ్‌లో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ రికార్డు

Ram Charan

Ram Charan

Ram Charan: దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా రామ్‌చరణ్ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా‌గ్రామ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత అతి తక్కువ సమయంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్‌ ఉన్న హీరోగా చెర్రీ నిలిచాడు. ప్రస్తుతం అతడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ మూవీతో అమాంతం పెరిగిన చెర్రీ క్రేజ్ శంకర్ మూవీతో మరో స్థాయికి చేరుతుందని మెగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.

Read Also: Bigg Boss 6: ఎమోషన్ లెస్ సీజన్.. ఎవరికి వారే తోపు అనుకుంటున్నారు..!!

కాగా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లకు సంబంధించి టాలీవుడ్ హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 19.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పుష్ప సినిమా సక్సెస్ తర్వాత బన్నీకి ఫాలోవర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో రెండో స్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నాడు. అతడి ఖాతాలో 17.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. మూడో స్థానంలో నిలిచిన మహేష్‌బాబు ఖాతాలో 8.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఖాతాలో 8.9 మిలియన్ ఫాలోవర్లు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో 4.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

Exit mobile version