Peddi : ‘పెద్ది’ షూట్ కంప్లీట్ కావడానికి ముహూర్తం ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘పెద్ది’** (Peddi) సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని టీం ప్రకటించింది. సెట్స్ నుంచి రామ్ చరణ్ షేర్ చేసిన క్రేజీ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి చిత్ర బృందం ఒక అదిరిపోయే ప్రకటన చేసింది. గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్, మరో 6 రోజుల్లో పూర్తి కానుంది.
Also Read :Allu Arjun: ఇకపై ‘ఐకాన్ స్టార్’ పేరు, గొంతు వాడితే జైలుకే!
Also Read
- Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
- Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
ఈ సందర్భంగా సెట్స్‌లో రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ టీం అధికారికంగా అప్‌డేట్ ఇచ్చింది. షూటింగ్ త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది జూన్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి స్టార్ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ది సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఇక ఈ సినిమా చరణ్ కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని సమాచారం. షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రమోషన్స్ మొదలుపెట్టాలని చిత్ర బృందం భావిస్తోంది.
తాజావార్తలు
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?