Ram Charan: ఈ కాంబో లో ఒక సినిమా పడితే ఉంటది మహేషా … రికార్డులు గల్లంతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: చిత్ర పరిశ్రమ రోజురోజుకు కొత్త రంగులు పులుముకుంటుంది. ఒక హీరో ఒకలాంటి పాత్రలే చేయాలనీ కానీ, మరో హీరోతో కలిసి చేయకూడదు లాంటి నియమాలను తుడిచేస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్ అంటే మల్టీస్టారర్ అనే చెప్పాలి. ఇక ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలతో కుర్ర హీరోలు మల్టీస్టారర్స్ చేస్తూ హిట్లు అందుకుంటున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో మల్టీస్టారర్ రేంజే మారిపోయింది. సాధారణంగా.. టాలీవుడ్ మొత్తం ఒక్కటే.. సినిమాల విషయంలో హీరోలు పోటీ పడుతుంటారేమో కానీ.. బయట కలిసినప్పుడు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు. ఇక ఆ కాంబోలో ఒక సినిమా వస్తే బావుండు అని కోరుకుంటూ ఉంటారు. ఇక తమ అభిమాన హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ కు పండగే. తాజాగా అలంటి పండగే జరుపుకుంటున్నారు మెగా, సూపర్ స్టార్ ఫ్యాన్స్. అవును.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో నవ్వుతూ కనిపించారు. ఇక ఈ సంతోషానికి వేదికగా మారింది.. అన్నపూర్ణ స్టూడియోస్.
Venu Thottempudi: మహేష్ , అల్లు అర్జున్ సినిమాలు వదులుకున్నందుకు నాకేం బాధగా లేదు..
Also Read
- DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'డిగ్గర్'
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు అన్నపూర్ణ స్థూడియోస్ లో ఘనంగా నిర్వహించారు. వెంకయ్య నాయుడు.. ఏఎన్నార్ పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక ఈ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు కనిపించి అభిమానులకు కన్నుల విందు చేశారు. ముఖ్యంగా పిక్ ఆఫ్ ద డే అంటే.. మహేష్ బాబు, రామ్ చరణ్ కలిసి కూర్చొని మాట్లాడుకునేది అని చెప్పాలి. బ్లాక్ కలర్ డ్రెస్ లో చరణ్.. మెరూన్ కలర్ షర్ట్ లో మహేష్ పక్కపక్కన కూర్చొని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. మధ్యలో నమ్రత ఉన్న విషయాన్నీ కూడా పక్కనపెట్టి ఈ హీరోలు మాట్లాడుకుంటున్న తీరు ఎంతో ముచ్చటేస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఈ కాంబో లో ఒక సినిమా పడితే ఉంటది మహేషా … రికార్డులు గల్లంతే అని చెప్పుకొస్తున్నారు. ఇంకోపక్క ఇద్దరు సీతారామరాజులు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?